మెగా మేనల్లుడి డెబ్యూ బాధ్యత ముందు ఆయనదే!
`ప్రేమ కావాలి` సినిమాతో సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.
`ప్రేమ కావాలి` సినిమాతో సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆదిని హీరోగా పరిచయం చేసింది విజయ్ భాస్కర్. అతడి దర్శకత్వంలో `ప్రేమ కావాలి` తెరకెక్కింది. తొలి సినిమాతోనే ఆదికి మంచి హిట్ పడింది. ఆ విజయం తర్వాత ఆది కెరీర్ కొన్నాళ్ల పాటు వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోయింది. మధ్యలో వైఫల్యాలు ఎదురైనా ట్యాలెంటెడ్ నటుడు అన్న ఇమేజ్ తో అవకాశాలు అందుకుని ముందుకు సాగాడు.
అయితే ఆ సినిమా తో హీరోగా పరిచయం కావాల్సింది ఆది కాదు. మెగా మేనల్లుడు సాయిదుర్గ తేజ్ అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ భాస్కర్ ఆయన సినిమా వేడుకలో రివీల్ చేసారు. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన `ఉషాపరిణయం` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సాయితేజ్ గెస్ట్ గా విచ్చేసాడు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ తెలుగులో సాయిని లాంచ్ చేయాల్సిన బాధ్యత తనపైనే పెట్టినట్లు గుర్తు చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థలో ఆ సినిమా ప్లాన్ చేసాం. అది `ప్రేమ కావాలి`. కానీ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ లోకి ఆది వచ్చాడు` అని అన్నారు. ఈ విషయాన్ని సాయితేజ్ కూడా కన్పమ్ చేసాడు. సాయితేజ్ అప్పుడు ఎలా ఉన్నాడో? ఇప్పుడు అలాగే ఉన్నాడు. అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. మంచి హృదయం ఉన్న వ్యక్తి` అని అన్నారు. ఇక సాయిదుర్గ తేజ్ లక్కీగా తొలి సినిమాతో హిట్ అందుకున్నాడు.
లేదంటే ప్లాప్ సినిమాతో పరిచయం అవ్వాల్సింది. తొలుత వై.విఎస్ చౌదరి దర్శకత్వంలో `రేయ్` సినిమా పట్టాలెక్కించాడు. అదే సమయంలో ఏ.ఎస్ రవికుమార్ చౌదరితో పిల్లా నువ్వు లేని జీవితం సినిమా కూడా ప్రారంభమైంది. అయితే `రేయ్` సినిమా అనివార్య కారణాలతో మధ్యలో బ్రేక్ పడింది. ఈ గ్యాప్ లో `పిల్లా నువ్వు లేని జీవితం` రిలీజ్ అయి హిట్ అయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన `రేయ్` మాత్రం ప్లాప్ అయింది. ముందే `రేయ్` రిలీజ్ అయితే డెబ్యూ ప్లాప్ ఖతాలో పడేది. ఆ రకంగా సాయిదుర్గ తేజ్ ప్లాప్ నుంచి తప్పించుకున్నాడు.