నన్ను నేను మిస్‌ అవుతున్నా : విజయ్‌ సేతుపతి

ఆయన సాధారణ వ్యక్తులతో పాటు సెలబ్రెటీల వరకు అందరితో కూడా చాలా మర్యాదగా నడుచుకునే వ్యక్తిత్వం కలవాడు.

Update: 2024-06-14 13:12 GMT

తమిళ స్టార్‌ హీరోల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న హీరోల్లో చాలా సింపుల్ అండ్‌ స్వీట్‌ గా ఉండే హీరోలు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో విజయ్ సేతుపతి పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన సాధారణ వ్యక్తులతో పాటు సెలబ్రెటీల వరకు అందరితో కూడా చాలా మర్యాదగా నడుచుకునే వ్యక్తిత్వం కలవాడు.

గొప్ప నటుడు అనే భావన, ఈగో, గర్వం ఆయనలో ఎక్కడ కనిపించవు. తనను పలకరించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తి విజయ్ సేతుపతి అనడంలో సందేహం లేదు. పాన్ ఇండియా స్టార్‌ గా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి తాజాగా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

తెలుగు లో కూడా విడుదల అయిన ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ చేశారు. తెలుగు హీరో సుహాస్ 'మహారాజ' ప్రమోషన్ లో భాగంగా విజయ్ సేతుపతిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ సమయంలో సుహాస్ కి ముద్దు పెట్టి మరీ తన అభిమానం ను చాటుకున్నాడు.

ఇక సుహాస్ ఇప్పటికిప్పుడు మీరు ఏం మిస్‌ అవుతున్నారు అంటూ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఆయన నుంచి వచ్చింది. విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ... నన్ను నేను మిస్‌ అవుతున్నా.. నేను కుర్రాడిగా ఉన్న సమయంలో చాలా అమాయకంగా ఉండేవాడిని. లైఫ్ లో ఏం చేయాలి అనే క్లారిటీ ఉండేదే కాదు. ఫస్ట్‌ ఇయర్ కాలేజీలో చదువుతున్నప్పుడు సెకండ్‌ ఇయర్‌ సిలబస్ ఏం ఉంటుందనే విషయం కూడా తెలియదు.

Read more!

లైఫ్‌ లో ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉండేది. కానీ అది ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేది తెలియదు. పెద్ద కలలు కనడం తెలుసు కానీ దాన్ని ఎలా సాధించాలనే విషయం మాత్రం తెలియకపోయేది. నా పేదరికం నుంచి బయట పడాలి అని మాత్రం బలంగా కోరుకున్నాను. అలాంటి కుర్రాడిగా నన్ను నేను మిస్ అవుతున్నా అన్నాడు.

Tags:    

Similar News