100 కోట్లలో హీరో షేర్ ఎంతంటే?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన `మహారాజ` ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన `మహారాజ` ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిం చింది. వంద కోట్లకు పైగానే సినిమా వసూళ్లను రాబట్టింది. బడ్జెట్ పరంగా చూస్తే ఇది ఈ సినిమాని కేవలం 20 కోట్ల లోపే నిర్మించారు. అంటే ఈ సినిమాకి అన్నిరకాలుగానూ పంట పండినట్లే.
థియేట్రికల్ వసూళ్లే 100 కోట్లపైనే ఉంది. ఇండా శాటిలైట్, ఓటీటీ రైట్స్ చూసుకుంటే ఆ నెంబర్ అంతకంతకు పెరుగుతుంది. హిట్ సినిమా కాబట్టి అక్కడా మంచి బిజినెస్ జరిగి ఉంటుంది. అయితే ఈసినిమాకి విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదుట. ఒక్కో సినిమాకి అతడు 10 నుంచి 15 కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తాడు. కానీ ఈసినిమాకి ఛార్జ్ లేకుండానే పనిచేసాడు.
అలాగని మక్కల్ సెల్వన్ ఉచితంగా నిర్మాత కోసం సినిమా చేయలేదు. ఇందులో లాభాలు తీసుకునే లా ముందుగానే నిర్మాతతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన చూస్తే భారీ లాభాలు రావడంతో వాటా కూడా భారీగానే ముట్టి ఉంటుంది చెప్పొచ్చు. రెండు...మూడు సినిమాలకు అందుకునే పారితోషికం ఒక్క సినిమాతో లాభాలతోనే సేతుపతి సాధించాడు. మరి తాజా సక్సెస్ నేపథ్యంలో విజయ్ సేతుపతి ఇకపై ఇదే ప్రాతిపదికన కొనసాగుతాడా? లేక కొన్ని సినిమాలకే ఇలాంటి ఒప్పందం చేసుకుంటాడా? అన్నది చూడాలి.
అయితే ఇలాంటి ఒప్పందాలు అనేవి నిర్మాత-నటుడి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ని బట్టి ఉంటుంది. తమిళ్ వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇతర భాషల్లో సాధ్యమవ్వదు. విజయ్ సేతుపతి అన్ని రకాల పాత్రలు పోషిస్తాడు. రకరకాల భాషల్లో సినిమాలు చేస్తాడు. అయితే ఇటీవలే విలన్ పాత్రలు పోషించకూడదని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. హీరోగానే ఎక్కువ సినిమాలు చేస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం కమిట్ అవుతోన్న ప్రాజెక్ట్ లన్నీ అలాంటివే.