విజ‌య్ సేతుప‌తి వార‌సుడు సంచ‌ల‌నాల‌కు రెడీ

తమిళ చిత్రసీమలో క‌మ‌ల్‌హాస‌న్, విక్ర‌మ్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి విల‌క్ష‌ణ న‌టుడిగా విజయ్ సేతుపతికి గుర్తింపు ఉంది. పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేయ‌డంలో అత‌డికంటూ ఒక స్టైల్ ఉంది.

Update: 2023-11-24 07:59 GMT

తమిళ చిత్రసీమలో క‌మ‌ల్‌హాస‌న్, విక్ర‌మ్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి విల‌క్ష‌ణ న‌టుడిగా విజయ్ సేతుపతికి గుర్తింపు ఉంది. పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేయ‌డంలో అత‌డికంటూ ఒక స్టైల్ ఉంది. ఇటీవ‌ల విక్ర‌మ్ సినిమాలో సంతానం (సేతుప‌తి) పాత్ర‌ను చూసిన వారు దీనిని వెంట‌నే అంగీక‌రిస్తారు. విక్ర‌మ్ కంటే ముందు కూడా ఎన్నో క్లాసిక్ అన‌ద‌గ్గ పాత్ర‌ల్లో మెప్పించాడు సేతుప‌తి. జాతీయ ఉత్త‌మ న‌టుడిగాను అత‌డికి గౌర‌వం ద‌క్కింది.

అలాంటి గొప్ప న‌టుడి పుత్ర‌ర‌త్నం హీరోగా లాంచ్ అవుతున్నాడంటే దానిపై ఎలాంటి ఆస‌క్తి ఉంటుందో ఊహించ‌గ‌లం. తాజా స‌మాచారం మేర‌కు.. సేతుప‌తి తన కొడుకు సూర్య సేతుపతిని హీరోగా లాంచ్ చేయబోతున్నాడు. సూర్య సేతుప‌తి ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి చిత్రం `ఫీనిక్స్` ఈ ఉదయం చెన్నైలోని ఐకానిక్ AVM స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

ఉల‌గ‌నాయ‌గ‌న్ కమల్ హాసన్ - ఇండియన్ 2, కింగ్ ఖాన్ షారుఖ్ -జవాన్, కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ -కిసీ కా భాయ్ కిసీ కి జాన్ .. ద‌ళ‌ప‌తి విజయ్ - బిగిల్ వంటి సినిమాల్లోని ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాల వెనుక ఉన్న సీనియర్ స్టంట్ కొరియోగ్రాఫర్ అన‌ల్ అరసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఫీనిక్స్ అన‌ల్ అరసుకి ద‌ర్శ‌కుడిగా డెబ్యూ చిత్రం. ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కానుంది. ఫీనిక్స్‌కి `ఖైదీ` కంపోజర్ సామ్ సిఎస్ సంగీతం అందించనుండగా, బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజలక్ష్మి అరశకుమార్ నిర్మిస్తున్నారు.

విజ‌య్ సేతుప‌తి న‌టించిన నానుమ్ రౌడీ తాన్, సింధుబాహ్, విడుతలై 2 (రిలీజ్‌కి రానుంది) వంటి చిత్రాలలో సూర్య సేతుపతి బాల నటుడిగా చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఫీనిక్స్ గురించి మరిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

Tags:    

Similar News