రిటైర్మెంట్ కి ముందు అభిమానులకు మరోప్రైజ్!
సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తన మరో కోరికను సైతం నెర వేర్చుకోబుతున్నాడు.
తలపతి విజయ్ 2026 ఎన్నికలకు సన్నధం అవుతోన్న సంగతి తెలిసిందే. సొంతంగా పార్టీ స్థాపించి ప్రజా క్షేత్రంలోకి దిగేసాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` అనే సినిమా చేస్తు న్నాడు. ఇది పూర్తయిన వెంటనే మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ రెండు చిత్రాలు 2025 కల్లా రిలీజ్ అయిపోతాయి. అయితే ఈ సినిమాలు సెట్స్ లో ఉండగానే విజయ్ తనలో కొత్త కోణాన్ని కూడా ఆవిష్కరించబోతున్నాడు. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తన మరో కోరికను సైతం నెర వేర్చుకోబుతున్నాడు.
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కోసం ఓ పాట కూడా పాడబోతున్నాడుట. ఇప్పటివరకూ కేవలం విజయ్ వాయిస్ ని డబ్బింగ్ చెప్పడం వరకే పరిమితం చేసాడు. ఏనాడు పాటలు పాడింది లేదు. కానీ వెంకట్ ప్రభు సినిమా కోసం గాయకుడు కాబోతున్నాడు. దీనికి సంబంధించి ఆ చిత్రానికి సంగీతం అందిస్తున్న యువన్ శంకర్ రాజ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన ఓ కచేరీలో ఈ విషయాన్ని రివీల్ చేసారు. ఈ పాటకు సంబంధించిన రికార్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయట.
ఈ పాటని వెంకట్ ప్రభు తండ్రి గంగై అమరన సాహిత్యమందించారు. విజయ్ ఆలపిస్తాను అనడంతో ఆయ న ప్రత్యేకంగా ఈ పాటని రాసినట్లు సమాచారం. ఆ పాటని విజయ్ ఎంతో ఎంజాయ్ చేసి పాడారుట. ఆ పాట సినిమాలో చాలా ప్రత్యేకంగానూ ఉంటుందిట. మరి ఆ పాట ప్రత్యేకత ఏంటి? అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. విజయ్ సినిమాల నుంచి తప్పుకునే ముందు అభిమానుల్ని ఈ రకంగా కూడా అల రించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇంత వరకూ ఏ సినిమా కోసం పాటలు పాడింది లేదు. ఆయనతో పాడించాలని చాలా మంది మేకర్స్ ప్రయత్నించారు గానీ పనవ్వలేదు. కానీ తొలిసారి వెంకట్ ప్రభు ఛాన్స్ తీసుకోవడం యువన్ శంకర్ రాజా కూడా పట్టు బట్టడంతో కాదనకుండా విజయ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. విజయ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తోన్న సంగతి తెలిసిందే.