మెగాస్టార్ ని ఫాలో అవుతోన్న దళపతి
ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ GOAT అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
ఇళయదళపతి విజయ్ తమిళనాడు రాజకీయాలలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా తన పార్టీ పేరుని కూడా ప్రకటించారు. ఇంకా మీడియా ముందుకి వచ్చి అయితే విజయ్ మాట్లాడలేదు. కానీ ప్రకటనలు మాత్రం విడుదల చేస్తున్నారు. రాజకీయాలలోకి ప్రవేశించిన నేపథ్యంలో సినిమాలు వదిలేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తిగా సినిమా కెరియర్ పక్కన పెట్టి పూర్తిస్థాయిలో రాజకీయాలు చేస్తానని తెలిపారు.
దళపతి అభిమానులకి ఇది షాక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పొలిటికల్ స్పేస్ ని ఉపయోగించుకోవడానికి విజయ్ కి ఇంతకంటే మంచి టైం దొరకదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే రాజకీయాలలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా సామాజిక సందేశంతో ఉన్న కథలతోనే సినిమాలు చేసేవాడు. ఇప్పుడు విజయ్ కూడా అదే పంథాని ఫాలో అవుతున్నాడంట.
ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ GOAT అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సోషల్ మెసేజ్ కూడా ఉంటుందంట. దీని తర్వాత కార్తిక్ సుబ్బరాజుతో చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకొని హెచ్ వినోత్ డైరెక్షన్ లో మూవీకి విజయ్ ఒకే చెప్పాడంట. ఆ మూవీ కంప్లీట్ అయ్యాక పూర్తిగా సినిమాలు ఆపేయనున్నట్లు తెలుస్తోంది.
చిన్న వయస్సులోనే విజయ్ రాజకీయాలలోకి వెళ్తోన్న నేపథ్యంలో అభిమాన బలంతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తాడని భావిస్తున్నారు. అయితే అతని రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటా ప్రజలని ఎలా ఆకర్షిస్తాడు అనేది కూడా చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. మరో వైపు దళపతి రాజకీయాలలో సక్సెస్ అయ్యేంత వరకు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఒకే వేళ విజయ్ పూర్తిగా సినిమాలు పక్కన పెడితే మాత్రం ఏకంగా అరడజను సినిమాలు ఆగిపోతాయి. అందులో మూడు సీక్వెల్స్ కూడా ఉండటం విశేషం. ఇప్పటికే అధికారికంగా విజయ్ ప్రకటించిన నేపథ్యంలో అతనితో సినిమాలు చేయాలని అనుకుంటున్న దర్శకులు మరో అప్షన్ చూసుకుంటున్నారు. సినిమాల పరంగా రాజకీయాలలోకి అడుగుపెట్టే ముందు మాత్రం విజయ్ మెగాస్టార్ ని ఫాలో అవుతూ సందేశాత్మక కథలతో మూవీస్ చేసే ప్రయత్నం చేయడం విశేషమని చెప్పాలి.