ఆ హీరో తొలి ప్రయత్నంపై ఏమంటున్నాడంటే?
తెలుగు వాడైన విశాల్ కోలీవుడ్ జర్నీ గురించి తెలిసిందే. అక్కడ స్టార్ హీరోలతో పోటీ పడుతోన్న ఏకైక తెలుగు హీరో విశాల్ కావడం విశేషం.
తెలుగు వాడైన విశాల్ కోలీవుడ్ జర్నీ గురించి తెలిసిందే. అక్కడ స్టార్ హీరోలతో పోటీ పడుతోన్న ఏకైక తెలుగు హీరో విశాల్ కావడం విశేషం. తమిళ మార్కెట్ కోసం ఇప్పుడున్న తెలుగు హీరోలంతా ఎంతో ప్రయత్నిస్తున్నా! విశాల్ మాత్రం వాళ్ల కే పోటీగా దూసుకెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఆయన పోషించిన వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.
ఆ చిత్రాల్ని అనువాద రూపంలో సొంత భాషలోకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. ఇక `డిటెక్టివ్ -2` సినిమాతో దర్శకుడిగా కూడా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మిస్కిన్ దర్శకత్వం వహించిన డిటెక్టివ్ మంచి విజయం సాధించడంతో ఇప్పుడా చిత్రానికి కొనసాగింపు రూపొందుతుంది. అయితే కెప్టెన్ బాధ్యతల నుంచి మిస్కిన్ స్కిప్ కొట్టడంతో నేరుగా విశాల్ రంగంలొకి దిగాడు. తాజాగా ఈ సినిమాని ఉద్దేశించి ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు విశాల్.
`ఇండస్ట్రీలో 25 కల ఇది. ఇప్పుడే ప్రయాణం మొదలైంది. నేను జీవితంలో ఎలా ఉండాలను కుంటున్నానో నా మొదటి ఆలోచన ఇప్పుడు నిజమైంది. నా కెరీర్ లో సవాల్ తో కూడుకున్న బాధ్యత ఇది. డిటెక్టివ్-2 కోసం లండన్ బయల్దేరాం. అజర్ బైజాన్ మూలాల్లో షూటింగ్ జరుపుతాం. ఈ ప్రయాణం గురించి మాటల్లో చెప్పలేకపోతున్నాను. పడిన కష్టం ఎప్పుడూ వృద్దా కాదంటూ నా తండ్రి చెబుతుం టారు. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఇదే మాట చెబుతారు.
వాళ్లిద్దర్నీ ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటివరకూ నటుడిగా కొనసాగాను. ఇప్పుడు దర్శకుడిగా నా ప్రయా ణాన్ని ప్రేక్షకులు అశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నా కల ఇంత తొందరగా నేరవేరుతున్నందకు మిస్కిన్ సర్ కి ప్రత్యేక ధన్యవాదాలు. రీల్ లైఫ్ అయినా..రియల్ లైఫ్ అయినా ఎవరి బిడ్డను అనాధగా విడిచి పెట్టను. గమ్యం చేరేలా చేస్తాను సార్ ` అని అన్నాడు. వాస్తవానికి ఈ సీక్వెల్ ని కూడా మిస్కిన్ తెరకెక్కించాలి. కానీ ఆయన తప్పుకోవడంతో ఆ బాధ్యతలు విశాల్ తీసుకున్నాడు. కథ మాత్రం మిస్కిన్ అందించినట్లు తెలుస్తోంది.