దసరాకి 'విశ్వంభర' ట్రీట్‌ ఏంటో తెలుసా..!

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'విశ్వంభర'.

Update: 2024-09-12 23:30 GMT
దసరాకి విశ్వంభర ట్రీట్‌ ఏంటో తెలుసా..!
  • whatsapp icon

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'విశ్వంభర'. బింబిసార చిత్రం తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు వశిష్ట ప్రస్తుతం చిరంజీవి తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2025 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా సంక్రాంతికి రాబోతుండగా ఈ దసరాకి ఫ్యాన్స్ కి చాలా పెద్ద ట్రీట్‌ ను దర్శకుడు వశిష్ట ఇవ్వబోతున్నాడట.

మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ దసరాకు 'విశ్వంభర' సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దసరాకు ఇంచా చాలా సమయం ఉన్నా ఇప్పటికే టీజర్ కట్‌ పూర్తయిందని, ప్రస్తుతం సంగీత దర్శకుడు కీరవాణి ఆ టీజర్ కోసం చక్కని పవర్ ఫుల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్ ను రెడీ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెల చివరి వరకు టీజర్ పూర్తి వర్క్ కంప్లీట్ చేసే విధంగా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. ఒక వైపు సినిమా షూటింగ్‌ చేస్తూనే మరో వైపు టీజర్ వర్క్ నూ చూసుకుంటున్నాడు.

చిరంజీవి విశ్వంభర సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మొత్తం తెలుగు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కారణంగా టీజర్‌ వారి అంచనాలను మరింతగా పెంచే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి టీజర్ అప్డేట్ అధికారికంగా రాలేదు. వచ్చే వారంలో విశ్వంభర యూనిట్‌ సభ్యులు స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. చిరంజీవి లుక్ కోసం, పాత్ర ఎలా ఉంటుందో చూడ్డం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి విశ్వంభర సినిమాతో సోషియో ఫాంటసీ కథాంశంతో సినిమాను చేయడం జరిగింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటించగా పలువురు ముద్దుగుమ్మలు చిరంజీవికి చెల్లి పాత్రలో, ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమాలోని పాత్రలను, కథను రివీల్ చేసే విధంగా టీజర్‌ ఉంటుందా, కేవలం కాన్సెప్ట్‌ మాత్రమే రివీల్‌ చేసి, చిరంజీవిని చూపిస్తారా అనేది చూడాలి. మొత్తానికి విశ్వంభర సినిమా సీక్రెట్స్‌ చాలా వరకు ఈ దసరాకు రాబోతున్న టీజర్‌ తో రివీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News