మిస్టర్ బచ్చన్ నిర్మాతకు ఆ అర్హత లేదట
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తోను ఆయన చాలా సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే.
రాజకీయ మూలాలున్న తెలుగు సినీనిర్మాత టి.జి.విశ్వప్రసాద్. ఆయన సోదరుడు ఎంపీ టీజీ వెంకటేష్ గురించి పరిచయం అవసరం లేదు. మహా కూటమి గెలిచి అధికారం చేపట్టాక బహిరంగంగా శుభాభినందనలు తెలియజేస్తూ విశ్వప్రసాద్ పార్టీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తోను ఆయన చాలా సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే.
ఇక టీజీ విశ్వప్రసాద్ టాలీవుడ్ లో దూకుడున్న నిర్మాత. వరుసగా సినిమాలు తీస్తూ తక్కువ కాలంలో వంద సినిమాల మైలురాయికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ని చేర్చనున్న ఘనుడు. అతడు ఏ విషయంపై మాట్లాడినా చాలా క్లారిటీతో ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడుతారు. సినీరంగంలో పెట్టుబడులు ఎలా పెట్టాలో పూర్తి స్పష్ఠత తెలిసిన ఫిలింమేకర్.
అయితే ఆయన రాజ్యసభ పదవి కోసం వెంపర్లాడుతున్నారని చాలా కాలంగా మీడియాలో కథనాలొస్తున్నాయి. తాజాగా దీనిపై టిజి విశ్వప్రసాద్ స్వయంగా స్పష్ఠతనిచ్చారు. తాను అమెరికా పౌరుడిని అని, భారతదేశంలో రాజకీయాలు చేయాలంటే ఇక్కడి పౌరసత్వం ఉండాలని అన్నారు. సాంకేతికంగా అది తనకు వీలుపడదని కూడా వెల్లడించారు. అయినా తనకు పదవులపై ఆసక్తి లేదని, సినిమాలు చేస్తూ ముందుకు సాగుతానని తెలిపారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా టిజి నిర్మించిన మిస్టర్ బచ్చన్ ఈనెల 15న విడుదలవుతోంది. ప్రచార ఇంటర్వ్యూల్లో టిజి విశ్వప్రసాద్ చాలా విషయాలను ముచ్చటిస్తున్నారు.