ఆవేశం ట్రెండులో GOG విశ్వక్

చాలా మంది ఆ బిట్ ని షార్ట్ వీడియోగా చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Update: 2024-05-17 04:29 GMT

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాహద్ ఫాజిల్ ఆవేశం మూవీ ట్రెండ్ నడుస్తోంది. ఆ సినిమాలో ఓ సాంగ్ లో ఫాహద్ ఫాజిల్ స్థంభం వెనక్కి దాక్కుంటూ అటు, ఇటు చూస్తూ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాడు. ఈ వీడియో బిట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది ఆ బిట్ ని షార్ట్ వీడియోగా చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

హ్యాష్ ట్యాగ్ ఆవేశం పేరుతో ఈ షార్ట్ వీడియోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఈ ట్రెండ్ ని అనుసరిస్తూ ఆవేశం షార్ట్ వీడియో షేర్ చేశాడు. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం, మళ్ళీ మూవీ వాయిదా పడటంపై తన స్టైల్ లో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు.

2023 అక్టోబర్ 8 రిలీజ్ అనుకుంటే అప్పుడు వాయిదా పడింది. మార్చి 8న ప్లాన్ చేసుకుంటే మళ్ళీ వాయిదా పడింది. మే 17న రిలీజ్ ఫిక్స్ చేస్తే ఈ సారి కూడా వాయిదా పడింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న రిలీజ్ అని ఈ సారి కన్ఫర్మ్ చేశారు. ఇకపై వాయిదా పడే ఛాన్స్ లేదని, రిలీజ్ గ్యారెంటీ అని వీడియో చివర్లో విశ్వక్ షేక్ ఖరారు చేశాడు. ఆవేశం ట్రెండ్ ని ఉపయోగించుకొని విశ్వక్ సేన్ తన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ ని వెరైటీగా ఎనౌన్స్ చేసాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఆవేశం ట్రెండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి అదనపు ప్రమోషన్ గా ఉపయోగపడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్ గొడవలని, రాజకీయాలని ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కృష్ణ చైతన్య చూపిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్ షేక్ రౌడీగా, పొలిటికల్ లీడర్ గా భిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

నేహాశెట్టి, అంజలి ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిట్ అయితే విశ్వక్ సేన్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడుతుంది. మరి ఈ సినిమా ఏ స్టయిలో కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News