ఆల‌స్య‌మైతే వాళ్లంతా జంతువులు..ప‌క్షులే!

వెండి తెర‌పై ఆయ‌న‌ది ఓ ప్ర‌త్యేక ముద్ర‌. ఆయ‌నో జాన ప‌ద బ్ర‌హ్మ‌. మాయా సినీ ప్ర‌పంచంలో ఆయ‌న ఒకే ఒక్క‌డు. ఆయ‌నే ఉడిపి విఠ‌లాచార్య‌.

Update: 2025-01-28 07:30 GMT

ఆయ‌న మంత్ర న‌గ‌రికి మ‌హారాజు. సినిమాను అచ్చంగా వినోద‌మ‌యం చేసిన ద‌ర్శ‌కాచార్యుడు. నిరంత‌ర శ్రామికుడు. నిత్యాన్వేషి. జాన‌ప‌దాల‌పై ఆయ‌న‌ది గుత్తాధిప‌త్యం. మాయా ఛాయాగ్ర‌హ‌ణంతో ప్రేక్ష‌కుల‌ను స‌రికొత్త లోకంలో విర‌పింప చేసిన ఘ‌నుడు. వెండి తెర‌పై ఆయ‌న‌ది ఓ ప్ర‌త్యేక ముద్ర‌. ఆయ‌నో జాన ప‌ద బ్ర‌హ్మ‌. మాయా సినీ ప్ర‌పంచంలో ఆయ‌న ఒకే ఒక్క‌డు. ఆయ‌నే ఉడిపి విఠ‌లాచార్య‌. నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా కొన్ని నెటి త‌రానికి తెలియాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

మంత్ర తంత్రాలతో రెండున్నర గంటల పాటు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదం ఆయ‌నతోనే సాధ్య‌మైంది. ఉన్న‌ది లేన‌ట్లుగా..లేన‌ది ఉన్న‌ట్లు సృష్టించడం కంప్యూట‌ర్ గ్రాఫిక్స్. అలాంటి గ్రాపిక్స్ లేని రోజుల్లోనే ప్రేక్ష‌కుల‌కు ఎన్నో కొత్త అనుభూతుల్ని అందించారు. అందుకే ఆయ‌న్ని `హీ మ్యాన్ టెక్నీషియ‌న్` గా పేర్కొన్నారు. 'ది ఇండియ‌న్ హీమ్యాన్ టెక్నీషియ‌న్' పేరుతో ఆయ‌న రాసిన ప‌రిశోధ‌న గ్రంధంలో విఠ‌లాచార్య‌కు 5వ స్థానం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

జాన‌ప‌ద సినిమాలు తెర‌కెక్కించ‌డంలో ఆయ‌న‌కు స్పూర్తి 'మాయాబ‌జార్'. తొలి నాళ్ల‌లో 'క‌న్యాదానం', 'వ‌దంటే పెళ్లి', 'పెళ్లి మీద పెళ్లి', 'అన్నా చెల్లెలు' వంటి సాంఘిక చిత్రాల‌తో మెప్పించారు. 'క‌న‌క‌దుర్గా పూజా మ‌హిమ‌'తో ఆయ‌న జాన‌ప‌ద చిత్రాల విజ‌య ప‌రంప‌ర 'అగ్గిబ‌రాటా', 'అగ్గిపిడుగు', 'చిక్క‌డు దొర‌క‌డు',' క‌ద‌ల‌డు వ‌ద‌ల‌డు' , 'జ్వాలా దీప ర‌హ‌స్యం', 'గండికోట రహ‌స్యం', 'ల‌క్ష్మీ క‌టాకం', 'జ‌గ‌న్మోహిని' లాంటి ఎన్నో సినిమాల‌తో ఆయ‌న ప్ర‌యాణం ముడిప‌డి ఉంది.

విఠ‌లాచార్య ప‌నిరాక్ష‌సుడు. టైమ్ టూ టైమ్ అన్ని పూర్తి చేసేవారు. షూటింగ్ స‌మ‌యంలోనూ ఆయ‌న అంతే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించేవారు. ప‌ని విష‌యంలో న‌టుల‌తో ఎక్క‌డా రాజీ ప‌డేవారు కాదు. అనుకున్న టైమ్ కి నటులు సెట్స్ కి రాక‌పోతే వాళ్ల పాత్ర‌ల‌ను జంతువుల‌గాను, ప‌క్షుల‌గానూ మార్చేవారు. ఆయ‌న ప్ర‌యోగాల‌కు ఇది ఓ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఓ సంద‌ర్భంలో ఆయ‌నే అన్నారు.

Tags:    

Similar News