ఫైర్ బ్రాండ్ ఎక్క‌డైనా ఎటాకే.. తగ్గేదేలే!

అయినా స‌రే మ‌రోసారి త‌గ్గేదేలే అంటూ నెటి జ‌నుడిపై త‌న‌దైన శైలిలో ఎటాక్ చేసారు. ప్ర‌స్తుతం వివేక్ అగ్నిహోత్రి ద‌ర్శ‌కుడిగా ది `దిల్లీ ఫైల్స్ : బెంగాల్ చాప్ట‌ర్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

Update: 2025-02-19 09:48 GMT

బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి ఎటాకింగ్ ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న సినిమా పై ఇండ‌స్ట్రీ కామెంట్ చేసినా? సోష‌ల్ మీడియాలో నెటి జనులు కామెంట్ చేసినా? వివేక్ ఎటాకింగ్ లో ఎలాంటి వ్య‌త్యాసం ఉండ‌దు. త‌న‌దైన స్పైలిలో స్పందించి ధీటైన స‌మాధానం ఇవ్వ‌డం అగ్నిహోత్రి ప్ర‌త్యేక‌త‌. ఈ విష‌యంలో ఆయ‌న చాలాసార్లు నెగిటివ్ గానూ మారారు.

అయినా స‌రే మ‌రోసారి త‌గ్గేదేలే అంటూ నెటి జ‌నుడిపై త‌న‌దైన శైలిలో ఎటాక్ చేసారు. ప్ర‌స్తుతం వివేక్ అగ్నిహోత్రి ద‌ర్శ‌కుడిగా ది `దిల్లీ ఫైల్స్ : బెంగాల్ చాప్ట‌ర్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇది ఆన్ సెట్స్ లో ఉంది. అయితే ఈసినిమాని ఉద్దేశించి ఓ నెటిజ‌నుడు నెగిటివ్ గా కామెంట్ చేసాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుంద‌ని అన్నాడు. `వ్యాక్సిన్ వార్` ఎలా ఫెయిలైందో దిల్లీ ఫైల్స్ చిత్రం కూడా అలాగే ప్లాప్ అవుతుంద‌ని ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టాడు.

సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో ఓ సినిమాపై ఇలాంటి పోస్టులు వంద‌ల కొద్ది ఉంటాయి. అలా పెట్టిన వాళ్లు ఆ సినిమాలో హీరోకి వ్యతిరేకం కావ‌చ్చు? లేదా ద‌ర్శ‌కుడికి యాంటీ అవ్వొచ్చు. ఈ క్ర‌మంలో ఏ సినిమా విష‌యంలోనైనా ఇలాంటి పోస్టులు స‌హ‌జం. వీటిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ వివేక్ అగ్నిహోత్రి మాత్రం ఈ విష‌యాన్ని కూడా చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు.

ఆ నెటి జ‌నుడిని ఓ పిచ్చిడోతిలో పోల్చారు. `ది వ్యాక్సిన్ వార్` తో పెద్ద మొత్తంలో సంపాదించాం. ఆ డ‌బ్బుతోనే ఇప్పుడు డిల్లీ ఫైల్స్ తీస్తున్నాం` అని కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చారు. దీంతో మ‌రోసారి వివేక్ పేరు నెట్టింట సంచ‌ల‌నంగా మారింది. దీంతో మరికొంత మంది నెటి జ‌నులు పోస్ట్ పెట్టిన నెటి జ‌నుడుకి వివేక్ తో త‌స్మాత్ జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రించారు.

Tags:    

Similar News