పాండే బ్యూటీ ముచ్చటగా మూడవసారి పడిందా ప్రేమలో!
తాజాగా ఆ ప్రచారాన్ని మరింత బలపరుస్తూ ప్రియుడు వాకర్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఈరోజు అనన్యా పాండే పుట్టిన రోజు.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే లవ్ ఎఫైర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఇద్దరికీ బ్రేకప్ చెప్పింది. తొలుతు ఇషాన్ కట్టర్ తో మూడేళ్ల పాటు ప్రేమాయణం నడిపింది. అటుపై అమ్మడు అతడికి కటీఫ్ చెప్పింది. అనం తరం కొంత కాలం కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సొగసరి ఆదిత్యారాయ్ కపూర్ కి మనసిచ్చింది. ఇద్దరూ కలిసి మీడియాకి చిక్కిన సందర్భాలెన్నో. చిలాక..గోరికంల్లా మీడియాలో హైలైట్ అయ్యారు.
ఈ జోడీని చూసి పెళ్లి చేసుకుంటారనే ప్రచారం పీక్స్ లో జరిగింది. కట్ చేస్తే అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఇటీవలే ఈ జోడీ కూడా విడిపోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. బ్రేకప్ పార్టీ సైతం ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇరువురు తమ స్నేహితుల్ని పిలిచి మరీ పార్టీ ఇచ్చి మేం విడిపోతున్నాం అని ప్రకటించారు. ఇలా అనన్యా పాండే మనసు రెండు సార్లు ముక్కలైంది.
అయినా సరే? ఐడోంట్ కేర్ అంటూ మూడవసారి లవ్ లో పడింది. ఈసారి మోడల్ వాకర్ బ్లాంకోతో ప్రేమలో పడింది. ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారని నెల రోజులుగా ప్రచారం గట్టిగానే జరుగుతోంది. తాజాగా ఆ ప్రచారాన్ని మరింత బలపరుస్తూ ప్రియుడు వాకర్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఈరోజు అనన్యా పాండే పుట్టిన రోజు. ఈసందర్బంగా వాకర్ తనదైన శైలిలో విషెస్ తెలియజేసాడు.
హ్యాపీ బర్త్ డే బ్యూటీఫుల్. నెవ్వెంతో స్పెషల్. ఐలవ్ యూ`అని రాసుకురావడంతో విషయం జనాలకు రీచ్ అయింది. ప్రేక్షకులంతా ప్రేమ వ్యవహారాన్ని కన్పమ్ చేసుకుంటున్నారు. మరి ఈ ప్రయాణం పెళ్లి వరకూ దారి తీస్తుందా? మద్యలో వీగిపోతుందా? అన్నది చూడాలి. బాలీవుడ్ లో ప్రేమించుకోవడం. .విడిపోవ డం..విడాకులు తీసుకోవడం సర్వసాధారణం. సెలబ్రిటీ లైఫ్ స్టైల్లో ఇవో భాగంగా కనిపిస్తుంటాయి.