45 లో కొత్త జీవితంలోకి ఫేమస్ కమెడియన్
కోలీవుడ్ కమెడియన్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ జీ గురించి పరిచయం అవసరం లేదు.
కోలీవుడ్ కమెడియన్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ జీ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. సంగీత దర్శకుడిగానూ మంచి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడీ నటుడు వివాహానికి రెడీ అయ్యాడు. ఇంతవరకూ బ్యాచ్ లర్ లైఫ్ ని ఎంజాయ్ చేసిన ప్రేమ్ జీకి 45 ఏళ్ల వయసులో పెళ్లిపై మనసు లాగింది. అను అనే యువతిని వివాహం చేసుకుంటున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది.
అలాగే పెళ్లి రోజు ఇదేనంటూ ఆహ్వాన పత్రిక సైతం పంపేసాడు. ఇందులో జూన్ 9న తమిళనాడు లోని తిరువళ్లూరు జిల్లాలో తిరువత్తిన్ మురగన్ ఆలయంలో వివాహం జరుగుతున్నట్లు రాసి ఉంది. అయితే ప్రేమ్ జీ ఇలా సడెన్ గా పెళ్లి వార్త చెప్పేసరికి ఇందులో నిజమెంతో? తెలియని కన్ ప్యూజన్ మొదలైంది. నిజంగా పెళ్లి చేసుకుంటున్నాడా? లేక సినిమా ప్రచారంలో భాగంగా ప్రాంక్ లాంటి న్యూస్ బయటకు వదిలాడా? అంటూ సందేహిస్తున్నారు.
అసలే ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో ఈ తరహా ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. సినిమా కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకుని రకరకాల ప్రచారాలతకు తెర తీస్తున్నారు. ఇలాంటివి ఎక్కువగా టాలీవుడ్ నుంచి వస్తుంటాయి. కోలీవుడ్ లో మాత్రం రేర్ . ఈ నేపథ్యంలో ప్రేమ్ జీ అభిమానులు మాత్రం ఇదంతా నిజమే అంటున్నారు. దీనికో ఆధారం కూడా చూపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే ప్రేమ్ జీ వివాహం చెప్పినట్లు అభిమానులు గట్టిగా చెబుతున్నారు.
ఆ నెలలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో మరొక్కసారి ప్రేమ్ జీ కన్పమ్ చేస్తే సరి. ప్రస్తుతం ప్రేమ్ జీ నటుడిగా బిజీగా ఉన్నాడు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తున్నాడు. తలపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తోన్న `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` లోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు ప్రేమ్ జీకి సోదరుడు అన్న సంగతి తెలిసిందే. కస్టడీ, ప్రిన్స్ లాంటి తెలుగు చిత్రాల్లోనూ ప్రేమ్ జీ నటించిన సంగతి తెలిసిందే.