ధీర ఇంకా వెయిటింగ్ ఏంటో..?
నాగార్జున లాంటి సీనియర్ హీరో ఇంట్లో ఉన్నా సరే అఖిల్ ఈ విషయంలో బ్యాలెన్స్ తప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఓ పక్క కింగ్ నాగార్జున నా సామిరంగ అంటూ బాక్సాఫీస్ పై తన మార్క్ చూపిస్తుంటే తనయుడు అఖిల్ మాత్రం నెక్స్ట్ సినిమా విషయంలో కన్ ఫ్యూజన్ కొనసాగిస్తున్నాడు. ఏజెంట్ కోసం ఎంతో కష్టపడ్డ అఖిల్ ఆ సినిమా రిజల్ట్ తో ఎంతో డిస్టర్బ్ అయ్యాడు. ఆ సినిమా ఫెయిల్యూర్ మూడ్ నుంచి బయటకు రావడానికి చాలా టైం తీసుకున్నాడు. సినిమా హిట్టు ఫెయిల్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఎంతో కష్టపడిన సినిమా ఊహించిన ఫలితం అందుకోదు. ఏదో సరదాగా చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంటుంది. అయితే ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిందే.
నాగార్జున లాంటి సీనియర్ హీరో ఇంట్లో ఉన్నా సరే అఖిల్ ఈ విషయంలో బ్యాలెన్స్ తప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అఖిల్ నెక్స్ట్ సినిమా ధీర అంటూ కొన్నాళ్లుగా ఒక ప్రాజెక్ట్ డిస్కషన్స్ లో ఉంది. నూతన దర్శకుడు మహేష్ తో యువి క్రియేషన్స్ వారు ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. సినిమాను పీరియాడికల్ మూవీగా 100 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని టాక్. అయితే ఈ ధీర విషయంలో వ్యవహారం ఎంతకీ తెగట్లేదని చెప్పుకుంటున్నారు.
మామూలుగా అయితే ఈ టైం కల్లా సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఎక్కువ డౌట్లు.. మీటింగ్స్ జరుగుతున్నాయట. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ మరింత జాగ్రత్త వహిస్తున్నాడని తెలుస్తుంది. అఖిల్ ఏజెంట్ విషయంలో జరిగిన తప్పులు ఈ సినిమాకు జరగకూడదని భావిస్తున్నాడు. అందుకే ధీర సినిమా లేట్ అయినా పర్లేదు కానీ హిట్ మెటీరియల్ గా మార్చాలని అనుకుంటున్నారు.
అఖిల్ విషయంలో అది కరెక్ట్ అనిపించినా ఏజెంట్ వచ్చి ఏడాది కావొస్తుంది. ఆ సినిమా గురించి ఫ్యాన్స్ మర్చిపోవాలంటే తన నెక్స్ట్ సినిమా అప్డేట్స్ ఇస్తుండాలి. అలా కాకుండా సినిమాను ఇంకా లేట్ చేస్తే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అఖిల్ ధీర సినిమా కోసం యువి క్రియేషన్స్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. సినిమాతో ఎలాగైనా అఖిల్ కి బంపర్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. ధీర అనౌన్స్ మెంట్ త్వరలో వస్తుందని. సినిమా స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ కూడా అదిరిపోతాయని అంటున్నారు. ధీర తో అఖిల్ హిట్ ట్రాక్ ఎక్కాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుతున్నారు. అందుకే అఖిల్ సినిమా కోసం తనని తాను ప్రిపేర్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది.