ఈ డాగ్ వాక్ ఏంటి సారా...?
ముద్దుగుమ్మలు వయ్యారంగా నడిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ ముద్దుగుమ్మ తాను అలాగే నడవాలని భావించి మరీ ఓవర్ గా నడుము తిప్పడంతో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పు ఉంది.
బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె గురించి రకరకాలుగా మీమ్స్ వస్తూ ఉన్నాయి. ఆమె జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్ లో చేసిన క్యాట్ వాక్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. సారా అలీ ఖాన్ క్యాట్ వాక్ అంటూ ఇంకేదో వాక్ చేసింది అంటూ చాలా మంది ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.
సాధారణంగా ర్యాంప్ పై లేదా రెడ్ కార్పెట్ పై సెలబ్రిటీలు చేసే వాకింగ్ ను క్యాట్ వాక్ అంటారు. వయ్యారంగా ముద్దుగుమ్మలు తమ అందాలను ఆరబోస్తూ, విభిన్నమైన ఔట్ ఫిట్ లో కన్నుల విందు చేస్తూ ఉంటారు. సారా అలీ ఖాన్ కూడా తాజా ఈవెంట్ లో అందంతో అలరించింది.. అలాగే ఔట్ ఫిట్ తో కళ్లు మిరుమిట్లు గొలిపింది. కానీ వాకింగ్ విషయంలో విఫలం అయింది.
ర్యాంప్ వాక్ విషయంలో ఆమె సరైన శిక్షణ తీసుకున్నట్లుగా అనిపించలేదు. ముద్దుగుమ్మలు వయ్యారంగా నడిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ ముద్దుగుమ్మ తాను అలాగే నడవాలని భావించి మరీ ఓవర్ గా నడుము తిప్పడంతో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పు ఉంది. అందుకే ఇప్పుడు ఆ వీడియోను షేర్ చేసి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
సారా అలీ ఖాన్ చేసింది క్యాట్ వాక్ కాదు డాగ్ వాక్ అంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సారా అలీ ఖాన్ నార్మల్ గా నడిచినా బాగుండేది. ఓవర్ యాక్షన్ కి పోయి వయ్యారంగా నడవాలని భావించి ఇప్పుడు ట్రోల్స్ ని ఎదుర్కొంటోంది. సారా కి ర్యాంప్ వాకింగ్ కి శిక్షణ అవసరం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.