అర్ధరాత్రి సమంతకు వాట్సప్​ మెసేజ్​.. స్క్రీన్​షాట్ వైరల్​

హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2023-10-15 13:52 GMT

హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ.. తన ఆరోగ్యంపై పూర్తి ఫోకస్ పెట్టింది. మధ్యలో వెకేషన్లు, హాస్పిటల్ అంటూ ఇలా గడుపుతోంది. ఖాళీ సమయంలో ఫోటో షూట్లు, యాడ్ షూట్ అంటూ సోషల్​మీడియాలో సందడి చేస్తోంది.

అయితే ఈ ముద్దుగుమ్మకు అర్ధరాత్రి వచ్చి మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్క్రీన్​షాట్​ను ఆమె షేర్ చేయగా దానిని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

అదేంటంటే.. సామ్ జిమ్ ట్రైనర్ జునైద్ షేక్ నుంచి వచ్చిన మెసేజ్.

ఆదివారం సామ్​ జిమ్ నుంచి కాస్త విశ్రాంతి తీసుకుందామని అనుకోగా.. అతడు ముందు రోజు రాత్రి 11 గంటల సమయంలో మెసేజ్​ పెట్టి రెడీగా ఉన్నావా అంటూ గుర్తు చేశాడు. దీనికి సామ్​.. ఈ రోజు పొద్దునే నాకు బాడీ పెయిన్స్​గా ఉన్నాయి. ఇవాళ రెస్ట్ తీసుకుంటాను అంటూ బదులిచ్చింది.

దానికి నేను ఇక్కడే ఉన్నాను అన్నట్లుగా మళ్లీ తిరిగి రిప్లై ఇచ్చాడు. అంటే అప్పటికే జిమ్‌కు జునైద్ వచ్చి ఉన్నాడని అర్థంమవుతోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి ఇన్​స్టా స్టోరీస్​లో షేర్ చేసింది సామ్​.

సమంత పోస్ట్​ చేసిన ఆ స్క్రీన్​ షాట్​ తర్వాత మరో పిక్​ ఉంది. అందులో సమంత పింక్ కలర్​ టైట్​ ఫిట్ జిమ్​ వేర్​ డ్రెస్​లో ఫ్రంట్ వ్యూలో పుల్ అప్స్​ ​ చేస్తూ కనిపించింది. ఈ పిక్​కు 'మరో దారుణమైన సండే' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఆదివారం విశ్రాంతి తీసుకుందామనుకున్న సమంతను.. తన జిమ్ ట్రైనర్ వదలడం లేదన్నట్టుగా వ్యాఖ్య రాసుకొచ్చింది. అయితే ఈ పిక్​లో సమంత టైట్​ ఫిట్​గా, హాట్​గా కనిపించి ఆకట్టుకుంది.

ఇకపోతే సమంత రీసెంట్​గా ఖుషి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. త్వరలోనే సిటాడెల్​ వెబ్​సిరీస్​తో అలరించనుంది. ఆ తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్​ ఖాన్​తో ఓ సినిమా చేయనుందని ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News