గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ వచ్చేది అప్పుడేనా?

ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు.

Update: 2024-06-11 17:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఎస్ జె సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే శంకర్ ఓ వైపు ఇండియన్ 2 మూవీని రిలీజ్ కి రెడీ చేస్తూనే గేమ్ చేంజర్ షూటింగ్ కూడా కొనసాగిస్తున్నారు. జులైలో ఇండియన్ 2 మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

జూన్ నుంచి ప్రతి నెల ఒక పాన్ ఇండియా మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. దీంతో గేమ్ చేంజర్ కి ఇప్పట్లో అయితే ఎలాంటి స్లాట్ లు లేవు. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. ఇండియన్ 2 రిలీజ్ తర్వాత శంకర్ గేమ్ చేంజర్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నాడంట. ఈ లెక్కన చూసుకుంటే ఆగష్టు నుంచి గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో మొదలయ్యే ఛాన్స్ ఉంది. తరువాత రెండు, మూడు నెలల్లో రిలీజ్ చేయడం సాధ్యం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

అయితే ఈ సినిమా రిలీజ్ పై ఇప్పట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదంట. గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ మూవీ రిలీజ్ డేట్ పై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందంట. మేగ్జిమమ్ చివరి మూడు నెలల్లో గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం అయితే ఉందనే మాట దిల్ రాజు కాంపౌండ్ నుంచి వినిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా పాన్ ఇండియా స్థాయిలో చేస్తోన్న సినిమా ఇదే కావడంతో భారీ హైప్ నెలకొని ఉంది. శంకర్ ఇండియన్ 2 హిట్ అయితే గేమ్ చేంజర్ మూవీపైన కూడా బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అయితే ఇప్పటికే అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News