ద‌ర్శన్ కి బెయిల్...హెలికాప్ట‌ర్ లో ఇంటికా?

టాప్ లాయ‌ర్లు అంద‌రినీ రంగంలోకి దించి బెయిల్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.

Update: 2024-09-27 06:31 GMT

అభిమాని రేణుకాస్వామి హ‌త్య‌కేసులో క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్, ప‌విత్రాగౌడ్ స‌హా మ‌రో 15 మంది నిందితులుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వారంతా జైలుకెళ్లి 100 రోజులు పూర్త‌యింది. ఈ స‌మ‌యంలో ద‌ర్శ‌న్ భార్య విజ‌య్ ల‌క్ష్మి భ‌ర్త బెయిల్ కోసం ఎంత‌గాప్ర‌య‌త్నించిందో తెలిసిందే. ద‌ర్శ‌న్ రిమాండ్ కి వెళ్లిన నాటి నుంచి బ‌య‌ట‌కు తీసుకు రావాల‌ని శ‌తవిధాల ప్ర‌య‌త్నాలు చేసింది. టాప్ లాయ‌ర్లు అంద‌రినీ రంగంలోకి దించి బెయిల్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. కానీ ఇంత‌వ‌ర‌కూ బెయిల్ దొర‌క‌లేదు.

అయితే ఇటీవ‌లే కేసులో ఉన్న ఓ ముగ్గురుకి కోర్టు బెయిల్ ఇచ్చింది. అదేరోజు ద‌ర్శ‌న్ బెయిల్ పిటీష‌న్ కూడా విచార‌ణ‌కు వ‌చ్చింది. కానీ ఆ విచార‌ణ నేటికి వాయిదా వేసింది. మరి బెయిల్ వ‌స్తుందా? లేదా? అన్న‌ది ఇంకొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. అయితే బెయిల్ విష‌యంలో విజ‌య‌లక్ష్మి చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. దీంతో ఆమె భ‌ర్త‌నుఇంటికి తీసుకెళ్లే ఏర్పాట్లుకూడా చేసుకుంటుంది. ప్ర‌స్తుతం ద‌ర్శ‌న్ బ‌ళ్లారి జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ప‌రప్ప‌న్ అగ్ర‌హారం జైలు నుంచి అత‌డిని బ‌ళ్లారి జైలుకి త‌ర‌లించారు. దీంతో విజ‌య‌ల‌క్ష్మి బ‌ళ్లారు జైల్ నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ప్ర‌త్యేకంగా హెలికాప్ట‌ర్ సిద్దం చేసి పెట్టుకున్నారు. రోడ్డు మార్గంలో కారు లో వెళ్తే భ‌ద్ర‌తా ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. ద‌ర్శ‌న్ పై దాడి కూడా చేసే అవ‌కాశం లేక‌పోలేదు. అలాగే ట్రాఫిక్ ఇబ్బంది ఎదుర‌వుతుంది. వీట‌న్నింటి దృష్టిలో పెట్టుకునే విజ‌య ల‌క్ష్మి హెలికాప్ట‌ర్ సిద్దం చేసి పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.

త‌న భ‌ర్త‌కి క‌చ్చితంగా బెయిల్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం లాయ‌ర్లు క‌ల్పించ‌డంతోనే ఇంత కాన్పిడెంట్ గా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక ఈకేసు విష‌యంలో సాక్ష్యాల‌న్నీ ద‌ర్శ‌న్కి వ్య‌తిరేకంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.ప్రాధ‌మిక ద‌ర్యాప్తు నుంచి ఫోరెన్సిక్ నివేదిక వ‌ర‌కూ అన్నీ ద‌ర్శ‌న్ ని హంత‌కుడిగా చూపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బెయిల్ కూడా ఆల‌స్య‌మ‌వుతోంది.

Tags:    

Similar News