దేవర చివరి స్టెప్.. అతన్ని ఒప్పిస్తే అదిరిపోతుంది..!

ఎన్టీఆర్ దేవర కోసం కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం దేవరకు మంచి బూస్టింగ్ వస్తుంది.

Update: 2024-09-21 04:10 GMT

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. యువ సుధ ఆర్ట్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22 సాయంత్రం జరగనుంది. ఈ ఈవెంట్ కి రాజమౌళి, త్రివిక్రమ్ గెస్ట్ లుగా వస్తారని తెలుస్తుంది. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిరుద్ లైఫ్ పెర్ఫార్మెన్స్ పై అందరు ఆసక్తిగా ఉన్నారు.

సాధారణంగా అనిరుద్ ఏ సినిమాకు మ్యూజిక్ అందించినా సరే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైవ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తాడు. సినిమాకు తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అందించే అనిరుద్ ఈవెంట్ లో అలా లైవ్ పెర్ఫార్మ్ చేయడంతో మరింత ప్రజల్లోకి వెళ్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా హుకుం సాంగ్ ని లైవ్ పెర్ఫార్మ్ చేయడంతో అది సెన్సేషనల్ హిట్ అయ్యింది.

దేవర సినిమాలో కూడా ఎన్టీఆర్ కోసం ఫియర్ సాంగ్ కంపోజ్ చేశాడు అనిరుద్. ఎన్టీఆర్ దేవర కోసం కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం దేవరకు మంచి బూస్టింగ్ వస్తుంది. అసలే అనిరుద్ మీద తారక్ కి చాలా మంచి ఒపీనియన్ ఉంది. అనిరుద్ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్తాడని ఎన్టీఆర్ చెబుతూ వస్తున్నాడు. దేవర కోసం అనిరుద్ కాంట్రిబ్యూషన్ మ్యూజిక్ రూపంలో తెలుస్తుంది.

ఎన్టీఆర్ దేవర సినిమా ఈవెంట్ లో అనిరుద్ తన పెర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఇక్కడ ప్రేక్షకులకు అతను మరింత దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి అనిరుద్ లైవ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. తెలుగులో దేవర లాంటి గొప్ప ఛాన్స్ అందుకున్న అనిరుద్ ఈ సినిమాతో సత్తా చాటితే మాత్రం తప్పకుండా అతనికి ఇక్కడ నుంచి వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఇక ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ఫుల్ ఫీస్ట్ అందిస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News