పుష్ప 2… హిందీలో ఫస్ట్ డే ఎంత రావచ్చు?

రాజమౌళి సినిమాలకి మించి ఈ మూవీపై బిజినెస్ జరగడం ఓ విధంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Update: 2024-10-28 06:49 GMT

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ గురించి చర్చ నడుస్తోంది. ఇండియాలోనే అత్యధిక బిజినెస్ జరిగిన చిత్రంగా ఈ మూవీ ఉండటంతో ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. డిస్టిబ్యూటర్స్ భారీగా పెట్టుబడి పెట్టి ఈ సినిమా రైట్స్ ని ఆయా రాష్ట్రాలలో కొనుగోలు చేశారు. రాజమౌళి సినిమాలకి మించి ఈ మూవీపై బిజినెస్ జరగడం ఓ విధంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే ఈ చిత్రంపై పైన ఉన్న హైప్ నేపథ్యంలోనే భారీగా బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ 1000 కోట్లు దాటడంతో కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇండియాలోనే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ ఉంది. ఈ మూవీ 257 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి రోజు వసూళ్లు చేసింది. ‘పుష్ప 2’ ఈ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అలాగే హిందీలో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకునే చిత్రంగా కూడా ఈ చిత్రం నిలుస్తుందని భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ హిందీలో మొదటి రోజు 65.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ వసూళ్లని ‘పుష్ప 2’ సునాయాసంగా అధికమిస్తుందని అక్కడి డిస్టిబ్యూటర్ లెక్కలు వేసుకుంటున్నారు. కచ్చితంగా 50 కోట్లకి పైగా కలెక్షన్స్ ఓపెనింగ్ డే రావడం అయితే ఖాయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మూవీకి ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం 75 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అదే జరిగితే హిందీలో నెంబర్ వన్ స్టార్ గా ఉన్న షారుఖ్ ఖాన్ ఇమేజ్ ని సైతం బన్నీ దాటిపోయినట్లు అవుతుంది. ‘పుష్ప’ సినిమాకి హిందీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో కంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఈ చిత్రానికి ఎక్కువ ఆదరణ లభించింది.

ఈ నేపథ్యంలోనే హిందీలో ‘పుష్ప 2’ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇకపై వచ్చే సాంగ్స్, టీజర్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. రిలీజ్ లోపు మూవీ నుంచి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఎంతగా మార్కెట్ లోకి వెళ్తుందనే దానిపై ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News