పనికన్నా పబ్లిసిటీ మీద ఆధారపడుతున్నారా?
నటీనటులు..హీరోయిన్ల మధ్య పోటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు
నటీనటులు..హీరోయిన్ల మధ్య పోటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు. వెళ్లే వాళ్లు బయటకు వెళ్తూనే ఉంటారు. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి ట్యాలెంట్ తో పాటు లక్ కూడా కలిసి రావాలి అన్నది వాస్తవం. ప్రయత్నం చేసిన అందరూ సక్సస్ అవుతారు? అనడానికి లేదు. ఆ ప్రయత్నం నిబద్దతతో ఉండాలి. అంతకు మించి ఎంతో ఓపిక..సహనం ఉండాలి. ఇండస్ట్రీలో సక్సస్ అవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అలవర్చుకోవాలి.
తాజాగా యంగ్ బ్యూటీ యామీ గౌతమ్ ఓ సెక్షన్ నటీనటుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సక్సెస్ అవ్వడం కోసం కొంత మంది కేవలం పబ్లిసిటీ మీద దృష్టి పెడుతున్నారని..అలాంటి వారు పరిశ్రమలో సక్సెస్ అవ్వరని అంది. 'విభిన్న పాత్రలు పోషించిన నిలదొక్కుకోవాలని ఉన్న జాబితా కంటే పబ్లిసిటీ ద్వారా నిలబడాలి అన్న జాబితా ఎక్కువగా కనిపిస్తుంది. కేవలం హార్డవర్క్..కమిట్ మెంట్... డెడికే షన్..నటన పట్ల ఫ్యాషన్..సహనం ఉన్న వాళ్లు మాత్రమే ఎక్కువ కాలం పరిశ్రమలో కొనసాగుతారు.
పబ్లిసిటీ ద్వారా సక్సెస్ అయినా ఆ సక్సెస్ ఎంతో కాలం నిలబడదన్నారు. రిలీజ్ కి ముందు సినిమాని ఎంత మార్కెట్ చేసినా? దాని ఫలితం ఎలాంటిందన్నది రిలీజ్ తర్వాత తేలిపోతుంది. కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. లేకపోతే థియేటర్ నుంచి తీసేస్తారు. అలాంటప్పుడు సినిమాలో ఎలాంటి నటుడు ఉన్నాడు? అన్నది చూడరు. వాళ్లకు ఇమేజ్ ఉంటే అవకాశాలు వస్తాయి. కానీ పబ్లిసిటీ ద్వారా ఫేమస్ అయిన వారికి మాత్రం అవకాశాలు రావడం కష్టం అవుతుంది' అని అన్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. యామీగౌతమ్ ఎవర్నీ ఉద్దేశించి మాట్లాడినట్లు అంటూ బాలీవుడ్ లో చర్చకు దారి తీసింది. మొత్తం నటీనటులందర్నీ ఉద్దేశించి మాట్లాడిందా? లేక హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడిందా? అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.