కియారా తో యశ్ రొమాన్స్ పోటీ పడాల్సిందే!
ఇందులో కియారా-యశ్ లపై కొన్ని కీలక రొమాంటిక్ సన్నివేశాలుచిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 45 రోజుల పాటు ఉంటుందిట.
యశ్ కథనాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్ ఇండియాలో 'టాక్సిక్' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' తర్వాత యశ్ నుంచి రిలీజ్ అవుతోన్న సినిమా కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. 'టాక్సిక్' ఎలా ఉండబోతుంది? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని భారీ కాన్వాస్ పైనే తెర కెక్కిస్తున్నారు. నయనతార, కియారా అద్వాణీ, హ్యూమా ఖురేషీ, కరీనా కపూర్ ఇలా బాలీవుడ్ స్టార్లు అంతా భాగమవుతున్నారు.
ఇందులో యశ్ కిజోడీగా మాత్రం కియారా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసు కుంది. తాజాగా కొత్త షెడ్యూల్ ముంబైలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ముంబైలో కొన్ని సెట్లు సిద్దం చేస్తున్నారు. అందుకోసం కోట్ల రూపాయలు వెచ్చి స్తున్నారు. సన్నివేశాలన్నీ సెట్లలోనే షూట్ చేయాల్సి రావడంతో? ప్రత్యేకంగా వాటిని సిద్దం చేస్తున్నారు. ఈ నెలఖరు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.
ఇందులో కియారా-యశ్ లపై కొన్ని కీలక రొమాంటిక్ సన్నివేశాలుచిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 45 రోజుల పాటు ఉంటుందిట. అంటే కీలక నటీనటులపై కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు కూడా ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తారని తెలుస్తోంది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఇంతవరకూ యశ్ నటించింది లేదు. నటించినా అవి కేవలం కన్నడ వరకే పరిమితం. 'కేజీఎఫ్' లో ఆ ఛాన్స్ రాలేదు. కానీ టాక్సిక్ లో కియారాతో రొమాన్స్ కి స్కోప్ ఎక్కువగానే ఉంది. లేడీ డైరెక్టర్ అయినా ఈ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేస్తూ కొన్ని రొమాంటిక్ సీన్స్ రాసారు.
వాటికి అనుగుణంగానే షూటింగ్ నిర్వహిస్తారు. సదరు దర్శకురాలు పాన్ ఇండియా మార్కెట్ కి రొమాన్స్ కూడా కీలకంగా భావించినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ సన్నివేశాల్లో కియారా చెలరేగుతుంది. ఇప్పటికే ఆమె ఆ తరహా చిత్రాలు చేసింది. హీరోలతో ఇంటిమేట్ సీన్లు..లిప్ లాకులు ఆరంభంలోనే చేసింది. అలాంటి భామతో యశ్ ఇప్పుడు వాటిలో పోటీ పడాల్సిన సమయం వచ్చింది.