యిమ్మీ యిమ్మీ: జాక్విలిన్ ఊర మాస్ ఊప్స్
ఇప్పుడు అన్షుల్- శ్రేయ జోడీ తదుపరి సింగిల్ యిమ్మీ యిమ్మీ కోసం మరొకసారి కలిసి పని చేసారు. పార్టీ సాంగ్ ఔట్ పుట్ మాస్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
భారతీయ సంగీతం హద్దులు దాటింది.. మ్యూజిక్ లేబుల్ కర్త, నిర్మాత అన్షుల్ గార్గ్ గత సంవత్సరం ప్రతిభావంతురాలైన గాయని శ్రేయా ఘోషల్ సహా మొరాకో గాయకుడు సాద్ లామ్ జార్డ్‌లతో కలిసి తన లేబుల్ ప్లే DMF లో అత్యంత విజయవంతమైన సింగిల్ 'గులీ మాతా'ను విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఈ పాటలో సాంస్కృతిక సమ్మేళనం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అన్షుల్- శ్రేయ జోడీ తదుపరి సింగిల్ యిమ్మీ యిమ్మీ కోసం మరొకసారి కలిసి పని చేసారు. పార్టీ సాంగ్ ఔట్ పుట్ మాస్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కొత్త పాటలో శ్రేయా ఘోషల్ - ఫ్రెంచ్ R&B గాయకుడు టేక్ స్వరాలు ఆకట్టుకున్నాయి. పీయూష్ భగత్ - షాజియా సంజీ నృత్య దర్శకత్వం వహించిన మ్యూజిక్ వీడియోలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డ్యాన్సింగ్ విన్యాసాలు మాస్ ని కట్టి పడేస్తున్నాయి. అన్షుల్ గార్గ్ భారతీయ పాప్ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానిని సాధించడానికి జాక్విలిన్ సహా దేశంలోని గొప్ప కళాకారులతో కలిసి పని చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
యిమ్మీ యిమ్మీ కోసం అన్షుల్‌తో జతకట్టడం నా సింగిల్స్ జాబితాలో మరొక టిక్ మార్క్. అతడు గొప్ప సంగీత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఈ పాట కోసం చాలా వినోదభరితమైన రైడ్ షూట్ జరిగింది. యిమ్మీ యిమ్మీ వైబ్ చాలా రిఫ్రెషింగ్ గా ఎనర్జిటిక్ గా ఉంది. ప్రేక్షకులు కూడా పాటను ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను అని అన్నారు. తాజాగా రిలీజైన పాటలో జాక్విలిన్ మాస్ స్టెప్పులు కుర్రకారులో హుషారు నింపుతున్నాయి. ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ కిక్ నిస్తున్నాయని చెప్పాలి.
ఇండియన్ పాప్ మ్యూజిక్ సీన్ గ్లోబల్ పాప్ మ్యూజిక్ కంటే మెరుగ్గా ఉందని నిర్మాత అన్షుల్ గార్గ్ అన్నారు. తాజాగా లాంచ్ అయిన యిమ్మీ యిమ్మీ టీజర్ ఒక ఉల్లాసకరమైన పార్టీ ట్రాక్. ఇది ప్రేక్షకులను డ్యాన్స్ ఫ్లోర్‌లో ఆకర్షిస్తుంది. సంగీతం సాహిత్యం సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్త ఆకర్షణను కలిగి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్‌లో ఉంటుందని అన్నారు.