హిందూ సాంప్రదాయంలో వైయస్ షర్మిల కొడుకు పెళ్లి
వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి- ప్రియా అట్లూరి జంట వివాహ వేడుకలు ఇటీవల అత్యంత చర్చనీయాంశమయ్యాయి
వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి- ప్రియా అట్లూరి జంట వివాహ వేడుకలు ఇటీవల అత్యంత చర్చనీయాంశమయ్యాయి. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ జంట హిందూ- క్రిస్టియన్ రెండు విధానాల్లో పెళ్లి వేడుకలు జరుపుకున్నారు. ఇంతకుముందు క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకోగా.. ఈ రోజు షర్మిల షేర్ చేసిన కొత్త ఫోటోలను బట్టి హిందూ పద్ధతిలోను వివాహం చేసుకున్నారని అర్థమవుతోంది.
కొత్త ఫోటోలు యువ జంటను హిందూ వేషధారణలో ఆకర్షణీయంగా అద్భుతంగా ఆవిష్కరించాయి. చూపిస్తున్నాయి. కెమెరాలకు పోజులిస్తూ కుటుంబసభ్యులు నవ్వుతున్నారు. ఈ జంట క్రైస్తవ పద్ధతిలో హిందూ పద్ధతిలో కూడా వివాహం చేసుకున్నారు. ఇది ఈ రోజుల్లో ఆనవాయితీగా మారింది.
వధూవరుల పెళ్లి దుస్తులు ఎంతో ముచ్చటగొలుపుతున్నాయి. ట్రెడిషనల్ గోల్డ్ కలర్ జెరీ చీర, పింక్ బ్లౌజ్ లో ఎంతో ముచ్చటగా ఉన్న వధువు సరసన వైట్ అండ్ షైనీ డిజైనర్ కుర్తాలో వరుడు స్మార్ట్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వైఎస్ కుటుంబసభ్యుల వివాహ వేడుకలు ముగిశాయి. షర్మిల త్వరలో హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గత రెండు నెలలుగా షర్మిల ఆహ్వానించిన ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు.