NC23: రంగంలోకి ఆయన దిగాడు!
యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ లో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.
యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ లో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ నడవనుంది. మత్స్యకార జీవితాల నుంచి రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో స్టొరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు. ఇక సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.
త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి చందూ మొండేటి సిద్ధం అవుతున్నారు. కస్టడీ లాంటి డిజాస్టర్ తర్వాత నాగ చైతన్య చాలా కేర్ ఫుల్ గా NC23 సినిమాని చేయబోతున్నాడు. క్యారెక్టరైజేషన్ అర్ధం చేసుకోవడానికి కొద్ది రోజులు విశాఖ, శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో మాట్లాడారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని చందూ మొండేటి ఆలోచించారు.
అయితే అతను పెద్ద ప్రాజెక్ట్స్ కి చేస్తూ ఉండటంతో పాటు రెమ్యునరేషన్ పరంగా కూడా అందుబాటులో లేకపోవడంతో నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళిపోయారు. దసరాకి అదిరిపోయే రేంజ్ లో మ్యూజిక్ అందించిన కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ని ఖరారు చేసింట్లు తెలుస్తోంది. దసరాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన సంతోష్ నారాయణన్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సైంధవ్ చిత్రానికి వర్క్ చేస్తున్నారు.
NC23తో టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ని సంతోష్ నారాయణన్ సొంతం చేసుకోవడం విశేషం. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుందంట. క్యాస్టింగ్ అండ్ క్రూ మొత్తాన్ని ఫైనల్ చేసే పనిలో చందూ టీం పని చేస్తోంది.
ఏకంగా 60 కోట్ల వరకు ఈ సినిమాపై నిర్మాత అల్లు అరవింద్ ఖర్చు పెట్టబోతున్నారు. నాగ చైతన్య మార్కెట్ లెక్కల ప్రకారం కూడా అంత బడ్జెట్ రిస్క్ అని చెప్పొచ్చు. అయితే కథ డిమాండ్ చేయడంతో ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కార్తికేయ 2తో చందూ మొండేటి పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ సాధించాడు. దీంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.