ఆ ఇద్ద‌రు పుల్ స్టాప్ పెట్టినా ఇన్ని సందేహాలా?

అస‌లు విగ్నేష్ ని న‌య‌న‌తార ఏ కార‌ణంతో ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది? అది పొర‌పాటున జ‌రిగిందా? లేక కావాల‌నే అన్ ఫాలో చేసిందా? అలాగైతే కార‌ణం ఏంటి?

Update: 2024-03-11 07:11 GMT

న‌య‌న‌తార‌-విగ్నేష్ శివ‌న్ విడాకుల ప్ర‌చారం నెట్టింట ఏ రేంజ్ లో జ‌రిగిందో తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో న‌య‌న‌తార చేసిన ప‌నికి విడాకుల ఖాయ‌మ‌నే ప్ర‌చారం తారా స్థాయిలో జ‌రిగింది. వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతూ ఎవ‌రి జీవితాలు వారు చూసుకోవ‌డానికి రెడీ అవుతున్నారు అనే ప్ర‌చారంతో అభిమానుల గుండెల్లో బండ‌రాయి ప‌డిన‌ట్లు అయింది. అయితే ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కి అది కేవ‌లం ప్ర‌చారం మాత్ర మేన‌ని..తాము క‌లిసి ఉంటున్నామ‌ని క‌వ‌ల పిల్ల‌ల‌తో కూడిన ఫోటోల్ని షేర్ చేయ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇద్ద‌రు ధాంప‌త్య జీవితంలో సంతోషంగా ఉన్నార‌ని ..ఎలాంటి క‌త‌ల‌త‌లు చోటుచేసుకోలేద‌ని అభిమా నులు సంతోషం వ్య‌క్తం చేసారు. న‌య‌న‌తార‌కు ఇష్ట‌మైన వాటి గురించి విగ్నేష్ చ‌ర్చించ‌డంతో అన్ని గాలి వార్త‌ల‌ని తేలిపోయింది. సౌదీ అరేబియా వెకేష‌న్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైర‌ల్ అవ్వ‌డంతో అభి మానుల్లో మ‌ళ్లీ పునుప‌టి ఉత్సాహం క‌నిపించింది. ఒక‌రికొక‌రు కుటుంబ జీవితానికి క‌ట్టుబ‌డి ఉన్నా ర‌ని అభిమానులు భావిస్తున్నారు.

అయితే ఇవి గాలి వార్త‌లు అని తెలిసిన త‌ర్వాత ఇద్ద‌రు స్పందించ‌డానికి ఇంత ఆల‌స్యం ఎందుకు అయింది? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సోష‌ల్ మీడియాలో ఈ రకమైన ప్ర‌చారం జ‌రుగుతుం ద‌ని వారి దృష్టికి ఆల‌స్యంగా చేరిందా? లేక కావాల‌నే అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించారా? ఈ రెండు గాక క‌ల‌తలు చోటు చేసుకున్నా వాటిని ఇద్ద‌రు కూర్చుని అప్ప‌టిక‌ప్పుడు స‌రి చేసుకుని స్పందించారా? అంటూ కొత్త సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

అస‌లు విగ్నేష్ ని న‌య‌న‌తార ఏ కార‌ణంతో ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది? అది పొర‌పాటున జ‌రిగిందా? లేక కావాల‌నే అన్ ఫాలో చేసిందా? అలాగైతే కార‌ణం ఏంటి? అంటూ కొత్త క‌థ‌నాల‌కు తావిచ్చిన‌ట్లు అవుతుంది. ఏది ఏమైనా ప్ర‌స్తుతానికి ఇద్ద‌రు సంతోషంగా ఉన్నారు? అన్న‌ది అంతా సంతోషించాల్సిన విష‌యం. అలాగే వృత్తి ప‌రంగా ఇద్ద‌రు బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు సంయుక్తంగా నిర్మాణ సంస్థ‌ను స్థాపించి అక్క‌డా స‌క్సెస్ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

Tags:    

Similar News