వామ్మో.. దేవరకే ఎసరు పెట్టేలా ఉన్నాడే..
యంగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సలార్.
యంగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. నిజానికి సెప్టెంబర్ 28న ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఈ డేట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూసారు. కాని పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలో ప్రశాంత్ నీల్ సంతృప్తికరంగా లేకపోవడంతో మూవీ రిలీజ్ ఆయిదా వేశారు.
దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ నిరాశకి గురయ్యారు. అయితే బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆలస్యం అవుతుందని చిత్ర యూనిట్ లెటర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి ట్రై చేసింది. ప్రస్తుతానికి అయితే అధికారికంగా సలార్ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయం చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. కాని మూవీ రిలీజ్ డేట్ ని ఆసక్తికరమైన టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.
ముందుగా నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన అది సాధ్యం కాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 22, లేదా 29 తేదీలలో ఒకటి ఖరారు చేయాలని భావిస్తున్నారంట. సంక్రాంతికి కూడా సినిమాని తీసుకొచ్చే ఆలోచనలో సలార్ టీం లేదంట. అయితే ఇప్పుడు సలార్ రిలీజ్ డేట్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది.
దేవర చిత్రాన్ని ఏప్రిల్ 4న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. మూవీ షూటింగ్ ఆరంభంలోనే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే కొరటాల శివ ఓ వైపు షూటింగ్ కంప్లీట్ చేస్తూనే మరో వైపు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఉన్నపళంగా సలార్ చిత్రాన్ని కూడా దేవర మూవీకి వారం రోజుల ముందుగానే రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు.
మార్చి 29న సలార్ మూవీ రిలీజ్ అయితే మాత్రం బజ్ పరంగా కచ్చితంగా దేవర మూవీమీద ఎక్కువ ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. రెండు పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ అవుతున్న ఆడియన్స్ ఇంట్రెస్ట్ పరంగా ప్రభాస్ కి కొంత ఎడ్జ్ ఉంది. ఇండియన్ వైడ్ గా ప్రభాస్ మైలేజ్ ఎక్కువ ఉంది. అదే మార్చి 22న సలార్ రిలీజ్ చేస్తే దేవర థియేటర్స్ లోకి వచ్చేనాటికి రెండు వారాలు అయిపోతుంది కాబట్టి పెద్దగా ఎఫక్ట్ ఉండకపోవచ్చు. మరి మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.