చేసేది ఎమ్మార్వో కొలువు.. సోదాల్లో భారీ ట్రంకు పెట్టె నిండా కరెన్సీ
ఆరోపణలు వచ్చిన వారిపై గుట్టుగా విచారణ జరిపి.. పక్కా స్కెచ్ వేసి.. టైమ్లీగా సోదాలు నిర్వహించే ఏసీబీ అధికారులకు సైతం విస్మయానికి గురి చేశారో ఎమ్మార్వో.
ఆరోపణలు వచ్చిన వారిపై గుట్టుగా విచారణ జరిపి.. పక్కా స్కెచ్ వేసి.. టైమ్లీగా సోదాలు నిర్వహించే ఏసీబీ అధికారులకు సైతం విస్మయానికి గురి చేశారో ఎమ్మార్వో. చేసేది ఒక పాటి ఉద్యోగమే అయినా.. అవినీతి అనకొండగా అతగాడి సంపాదన చూసి అవాక్కుఅవుతున్నారు. ఒక మోస్తరు అధికారుల వద్ద బయటపడే ఆస్తుల కంటే ఎక్కువగా తాజా తిమింగళం వద్ద లభించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నల్గొండ జిల్లాలోని మర్రిగూడ తహసీల్దార్ గా పని చేస్తున్న మహేందర్ రెడ్డి ఇల్లు మాత్రం హైదరాబాద్ శివారులోని హస్తినాపురంలో ఉంది.
ఇతగాడి అవినీతి లీలల గురించి సమాచారం అందుకున్న అధికారులు.. పక్కా ప్లాన్ వేసి సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో మొత్తం పదిహేను చోట్ల సోదాల నిర్వహించారు. ఈ సందర్భంగా భారీఎత్తున ఆస్తులు.. నగదు లభించాయి. ఆయన నివాసం ఉండే ఇంట్లో ఏకంగా ఒక ట్రంక్ పెట్ట లభించటం.. దాన్కి తగ్గట్టు ఓపెన చేసిన అధికారులకు కళ్లు చెదిరిపోయినట్లుగా చెబుతున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న చిన్న ఉద్యోగి నుంచి ఇంతలా అక్రమ సంపాదన గుట్టు బయటకు రావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
మహేందర్ రెడ్డి ఇంట్లో దొరికిన ట్రంకు పెట్టెలో కట్టల కొద్దీ నోట్ల కట్టల్ని చూసిన అధికారులు సైతం నోరెళ్ల బెట్టిన పరిస్థితి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ట్రంకు పెట్టెలోని నోట్ల కట్టల విలువ దగ్గర దగ్గర రూ.2కోట్లకు పైనే ఉందంటున్నారు. అంతే కాదు.. కిలోల కొద్దీ బంగారంతో పాటు.. పలుచోట్ల భూములు ఉన్న విషయాన్ని గుర్తించారు. మొత్తంగా మహేందర్ రెడ్డి ఇల్లు.. ఆఫీసుల్లో కలిపి మొత్తం 15 చోట్ల తనిఖీలు నిర్వహిస్తే.. భారీ ఎత్తున ఆస్తులు బయటపడటం రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పలు కీలక డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేయించుకున్నారు.