158 వాహనాల ఘోర ప్రమాదం... యూఎస్ లో 7 గురు మృతి!
ఈ ప్రమాదంలో చాలా వాహనాలు ఒకదానికొకటు గుద్దుకుని నుజ్జునుజ్జు అవ్వగా... ఈ ప్రమాదంలో పుట్టిన మంటల్లో చిక్కుకుని మరికొన్ని వాహనాలు కాలి బూడిదయ్యాయి.
దట్టమైన పొగమంచు కారణంగా అమెరికాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ భారీ ప్రమాదంలో ఏకంగా 158 వాహనాలు పాల్గొనడం గమనార్హం. ఇందులో చిన్న చిన్న వాహనాల నుంచి 18 చక్రాల భారీవాహనాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ తేలిన మృతుల సంఖ్య 7 కాగా... మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని రాష్ట్ర పోలీసులు సోమవారం రాత్రి తెలిపారని స్థానిక మీడియా వెల్లడించింది.
అవును... దక్షిణ లూసియానా మార్ష్ మంటలు, దట్టమైన పొగమంచు "సూపర్ ఫాగ్" కారణంగా జరిగిన ప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించారని తెలుస్తుంది. మొత్తం 158 వాహనాలు ఈ ప్రమాదం కారణంగా డ్యామేజ్ అయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఏడుగురు మృతి చెందగా... ఇరవై ఐదు మంది గాయపడ్డారని చెబుతున్నారు.
ఈ ప్రమాదం జరిగిన అనంతరం ప్రత్యక్ష సాక్షులు స్పందించారు. అనంతరం ప్రమాద స్థలాన్ని క్లియర్ చేయడం చేశారని అంటున్నారు. ఈ ప్రమాదం జరిగిన తీరును, వాహనాలు చెల్లాచెదురైన పరిస్థితి పరిశీలిస్తే... మరణాల సంఖ్య పెరగవచ్చని లూసియానా స్టేట్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రమాదంలో చాలా వాహనాలు ఒకదానికొకటు గుద్దుకుని నుజ్జునుజ్జు అవ్వగా... ఈ ప్రమాదంలో పుట్టిన మంటల్లో చిక్కుకుని మరికొన్ని వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ సందర్భంలో చాలా మంది ప్రజలు రోడ్డు పక్కన జరిగిన నిలబడి విపత్తును చూసి నమ్మలేని స్థితిలో ఉండగా.. మరికొందరు సహాయం కోసం కేకలు వేశారు.
ఈ సందర్భంగా... అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా ఒకదానిపై ఒకటి పోగుపడిన కార్ల కుప్పలను తొలగించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రాంతంలో పలు చిత్తడి నేలల్లో మంటలు ఉన్నాయని.. "సూపర్ ఫాగ్" వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు ముందుగానే చారీ చేసినట్లు చెబుతున్నారు. ఇది మరికొన్ని రోజులు ఉండొచ్చని చెబుతున్నారు.
కాగా... న్యూ ఓర్లీన్స్ లోని, సమీపంలోని అనేక పాఠశాలలు పొగ, పొగమంచు కారణంగా ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వగా... మరికొన్ని పాఠశాలలు ఆలస్యంగా క్లాస్ లు ప్రారంభిస్తున్నాయి.