వేలాది కోట్ల అప్పు తీర్చేందుకు అదానీ రెఢీ.. అదెలానంటే?
ఇలాంటి వేళ..తన ఆర్థిక సత్తా చాటేందుకు కంపెనీకి ఉన్న రుణాల్ని ముందుగా చెల్లించటం ద్వారా తన ఆర్థిక శక్తిని ప్రపంచానికి చాటింది.
స్థాయికి మించిన అప్పులు చేశారన్న ఆరోపణలతో పాటు.. సంస్థ ఆర్థిక స్థితి మీదా.. షేరు ధర మీదా సందేహాలు వ్యక్తం చేస్తూ.. అదానీ గ్రూప్ మీద వచ్చిన ఆరోపణలు అన్నిఇన్ని కావు. అదానీ గ్రూప్ ఎక్కువ అప్పులతో ఉందని.. దాని వాస్తవ విలువ కంటే ఆర్థిక భారం ఎక్కువన్న మాట వినిపించేది. దీనికి తగ్గట్లే.. హిండెన్ బర్గ్ రిపోర్టు దెబ్బకు అదానీ సంస్థలకు చెందిన షేర్లు కుదేలు అయ్యాయి. ఇలాంటి వేళ..తన ఆర్థిక సత్తా చాటేందుకు కంపెనీకి ఉన్న రుణాల్ని ముందుగా చెల్లించటం ద్వారా తన ఆర్థిక శక్తిని ప్రపంచానికి చాటింది.
ఇదిలా ఉంటే 2024లో రూ.15వేల కోట్ల విదేశీ కరెన్సీ బాండ్లు మెచ్యూర్ అవుతున్నాయి. దీంతో.. భారీగా నగదు సమకూరనుంది. దీంతో.. నగదు చెల్లింపులు జరపాలని భావిస్తోంది. కొత్తబాండ్ విక్రయాలతో డెట్ రీఫైనాన్సింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్లాన్లను సిద్దం చేస్తోంది. జులై నాటికి అదానీ పోర్ట్స్ కు చెందిన రూ.5400కోట్ల రుణాల్ని నగదు రూపంలో చెల్లించటానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఏడాది రూ.2700 కోట్ల నగదును చెల్లించింది. మేలో మెచ్యూర్ అయ్యే అదానీ గ్రీన్ కు చెందిన రూ.4100 కోట్ల బాండ్ రీఫైనా్స్ కోసం రూ.3400 కోట్లు సమీకరించటానికి రుణదాతలతో గ్రూప్ చర్చలు జరుపుతోంది.
2019లో అమ్మిన అదానీ గ్రీన్ హోల్డింగ్ కంపెనీ బాండ్లలో రూ.6200 కోట్లు తిరిగి చెల్లించేందుకు వచ్చే ఏడాది సెప్టోంబరులో మెచ్యూర్ అయ్యే నగదు.. అందుకు సమానమైన లిక్విడిటీ ఫూల్ ను రూపొందిస్తోంది. ఒక అంచనా ప్రకారం అదానీ గ్రూప్ సంస్థలు మొత్తం రూ.62వేల కోట్ల మేర రుణాలు ఉన్నట్లు చెబుతున్నారు. హోల్డింగ్ కంపెనీలతో పోలిస్తే.. నగదు ప్రవాహాన్ని క్రియేట్ చేసే ఆపరేటింగ్ కంపెనీల్లో రీఫైనాన్సింగ్ సులువు అవుతుందని అంచనా వేస్తున్నారు.
అంతేకాదు.. మరిన్ని మార్గాల్లో భారీగా నగదు నిల్వల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా నాన్కన్వర్టబుల్ డిబెంచర్లను అమ్మటం ద్వారా రూ.5వేల కోట్లు.. నాన్ క్యుములేటివ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లద్వారాఅదనంగా రూ.250 కోట్లు సమీకరించే ప్రణాళికను కంపెనీ ప్రకటించింది. మొత్తంగా రుణ భారాన్ని తగ్గించుకోవటానికి వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది.