వీడియో: విమానంలో ఒక్కసారిగా కుదుపులు... 30 మందికి గాయాలు!

ఇటీవల కాలంలో విమాన ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-07-02 07:06 GMT

ఇటీవల కాలంలో విమాన ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. విమానం గాల్లో ఉన్న సమయంలో ఎమర్జెన్సీ డోర్లు ఊడిపోవడం మొదలు పలు ఇబ్బంది కర పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో తాజాగా విమానం గాల్లో ఉండగా భారీ కుదుపులు సంభవించాయి.. దీంతో 30 మందికిపైగా గాయపడ్డారాని అంటున్నారు.

అవును... విమానంలో ఒక్కసారిగా కుదుపులు వచ్చాయి. దీంతో.. ఆ విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే... కొంతమంది సీట్లలో నుంచి ఎగిరిపడగా.. ఒక వ్యక్తి అయితే ఏకంగా ఓవర్ హెడ్ బిన్ లో ఇరుక్కుపోయాడు. ఈ సమయంలో తోటి ప్రయాణికులు అతడిని కిందకి దించుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.

ఎయిర్ యూరోపా విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 789-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్ నుంచి ఉరుగ్వేకు బయలుదేరింది. ఆ సమయంలో ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ సమయంలో ఆ విమానంలోని ప్రయాణికులు ఎగిరెగిరి పడ్డారు. పిల్లలైతే ఏడుపులు, కేకలతో హోరెత్తించేశారట. దీంతో... బ్రెజిల్ లోని నాటల్ విమానశ్రయంలో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఎయిర్ యూరోపా సంస్థ స్పందించింది. ఇందులో భాగంగా... విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని.. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ఇదే సమయంలో ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.

Read more!
Tags:    

Similar News