ఈ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు మహిళ తల్లో పేలే కారణం!!

ఈ విచిత్ర ఘటన లాస్ ఏంజిల్స్ నుంచి న్యూయార్క్ కు వెళ్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో జరిగింది.

Update: 2024-08-08 11:25 GMT

సాధారణంగా విమానాలను అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ల్యాండీంగ్ చేస్తుంటారు. అందుకు కచ్చితంగా ఇంజిన్ లో సమస్యలు, విమానంలో మంటలు, మెడికల్ ఎమర్జెన్సీ, లేదా ఎవరైనా ప్రయాణికుడు శృతితప్పి ప్రవర్తించడం, సాంకేతిక సమస్యలు, వాతావరణ సమస్యలు మొదలైన కారణాల కారణంగా విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. అయితే... తల్లో పేలు ఉన్నాయని ఇటీవల విమానాన్ని అత్యవసరంగా ఆపేశారు!

అవును... వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాల నిజం! ఓ మహిళా ప్రయాణికురాలి జుట్టులో పేను చూసిన తర్వాత విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విచిత్ర ఘటన లాస్ ఏంజిల్స్ నుంచి న్యూయార్క్ కు వెళ్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో జరిగింది. విమానంలో గాల్లో ఉన్న సమయంలో ఓ మహిళ జుట్టులో పేను పాకుతున్నట్లు గుర్తించిన తర్వాత విమానాన్ని ఫినిక్స్ లో ల్యాండ్ చేశారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకరం.. లాస్ ఏంజిల్స్ నుంచి న్యూయార్క్ కు బయలుదేరిన ఓ విమానంలో మధ్యలో గందరగోళం నెలకొందంట. ఈ సమయంలో ఆ విమానంలోని ప్రయాణికుల్లో ఒకరైన ఈతాన్ జుడెల్సన్.. టిక్ టాక్ లో ఈ మేరకు తన అనుభవాని పంచుకున్నాడు. ఈ సందర్భంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి సంబంధించి పరిమిత సమాచారాన్ని మాత్రమే అందించారని తెలిపాడు.

అయితే తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే... ఇద్దరు అమ్మాయిలు, ఓ మహిళ జుట్టులో పేలు కనిపించడం చూసి, ఫ్లైట్ అటెండెంట్ ను హెచ్చరించారని జుడెల్సన్ వెల్లడించాడు. ఈ సందర్భంగా స్పందించిన అమెరికన్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి... జూన్ 15న లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ కి వెళ్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం 2201.. ప్రయాణికుని వైద్య అవసరాల కారణంగా ఫినిక్స్ కు మళ్లించబడిందని తెలిపారు!

Tags:    

Similar News