కమ్మ కులాన్ని తిట్టిన ఆమంచి క్రిష్ణ మోహన్!?

ఈ పరిణామాల నేపధ్యంలో సహనం కోల్పోయిన ఆమంచి క్రిష్ణ మోహన్ ఏకంగా కమ్మ సామాజికవర్గాన్నే దూషిస్తూ పరుష పదజాలంతో విరుచుకుపడడం చర్చనీయాంశం అయింది.

Update: 2023-08-12 04:45 GMT

రాజకీయాలు ఎంతలా దిగజారిపోతున్నాయో అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలను చూస్తే. ఒకపుడు రాజకీయం హుందాగా సాగితే ఇపుడు కులాలను తెచ్చి సంకుల సమరాలుగా మార్చేస్తున్నారు. మనిషి అన్న వారు పక్కకి పోయి ఫలానా కులం అనుకుంటూ ముందుకు వస్తున్నారు. అవేశ కావేశాలతో ఏకంగా కులం మొత్తానే నిందిస్తున్నారు.

ఎవరి మీద అయినా కోపం వస్తే మొత్తం కులాన్నే ముందు పెట్టి తిట్టేస్తునారు. కులం ఏమి చేసింది అన్నది కూడా అసలు ఆలోచన లేకుండా ఉంది. ప్రకాశం జిల్లాలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆమంచి క్రిష్ణ మోహన్ ఒక కులాన్ని పట్టుకుని నిందించడం తీవ్ర పదజాలంతో తిట్ల పురాణం అందుకోవడం చర్చనీయాంశమే కాదు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

ఆయన ఏకంగా కమ్మ కులాన్నే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం అందుకోవడం చూస్తే రాజకీయం మరీ ఇంతలా పాతాళానికి పోతుందా అని అనిపించకమానదు. ఇంతకీ జరిగింది ఏంటి అంటే అయితే చీరాల నియోజకర్గంలోని వేటపాలెం మండలంలోని ఓ పంచాయతీ పరిధిలోని వార్డులకు జరుగుతున్న ఉప ఎన్నికల నామినేషన్ సందర్భంగా రెండు వర్గాల మధ్యన పోరు సాగింది.

ఇలా రెండు వర్గాల మధ్యన విభేదాలు కాస్తా వీధిన పడ్డాయి. ఇలా ఒక పంచాయతీ ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడమే కాకుండా వైసీపీలో ఉన్న రెండు వర్గాల మధ్య భారీ పోరుకు కారణం అయింది. దాంతో అది కాస్తా రణరంగంగా మారింది.

ఈ పరిణామాల నేపధ్యంలో సహనం కోల్పోయిన ఆమంచి క్రిష్ణ మోహన్ ఏకంగా కమ్మ సామాజికవర్గాన్నే దూషిస్తూ పరుష పదజాలంతో విరుచుకుపడడం చర్చనీయాంశం అయింది. చిరాల రామన్న పేటలో కరణం బలరాం వాళ్ల బాబాయ్ మీద ఆమంచి ఈ తిట్ల దండకం అందుకున్నారని అంటున్నారు. కానీ అది యావత్తు ఆ సామాజిక వర్గం మీద తిట్లుగా అంతా భావిస్తున్నారు. ఇదేమి విధానం అంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తుల మీద చూసుకోవాలి కానీ సామాజికవర్గాల మీద కాదు కదా అని అంటున్నారు.

అయినా ఎమ్మెల్యే చేసిన వారు ఒక స్థాయిలో ఉండాల్సిన వారు వాడుతున్న భాష ఇదేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక చీరల టికెట్ ని కరణం బలరాం కుటుంబానికి వైసీపీ ఖరారు చేసింది అని అంటున్నారు. ఆమంచిని పర్చూరు ఇంచార్జిగా పంపించారు. వివాదం సద్దుమణిగింది అనుకున్నా ఇపుడు ఒక పంచాయతీ ఉప ఎన్నిక మూలంగా అంతా రివర్స్ అయింది. మరి దీన్ని వైసీపీ ఎలా చక్కదిద్దుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.


Full View


Tags:    

Similar News