బాలయ్య మీసాలు తిప్పుతున్నారు.. అంబటి రాంబాబు ఫైర్!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.00 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ శానససభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి

Update: 2023-09-21 05:03 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.00 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ శానససభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సమయంలో చంద్రబాబు అరెస్టుపై టీడీపీ వాయిదా తీర్మానం అడిగింది. ఈ సమయంలో స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యుల ఆందోళనకు దిగారు.

అయితే చంద్రబాబు విషయంపై బీసీఏ లో చర్చిద్దాం రమ్మని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ సభ్యులకు సూచించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన బుగ్గన... బాబు అరెస్ట్ పై బీసీఏలో చర్చిద్దామని అన్నారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు శాతించకపోయే సరికి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో మంత్రి అంబటి రాంబాబు మైకందుకున్నారు!

అవును... ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు రెచ్చగొట్టే విధంగా ఉందంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొడుతున్నారని, ఆ పనేదో సినిమాల్లో చేయాలని, అసెంబ్లీలో కాదని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.

ఇక ఇక్కడ ప్రజా సమస్యలపై మాత్రమే చర్చించాలని తెలిపిన అంబటి.. మీ వాదనలు కోర్టులో వినిపించాలని.. టీడీపీ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఎత్తిన కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీలో నినాదాలు చేయడం గమనార్హం!

అంతకు ముందు... అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ శాసనసభాపక్షం నివాళులర్పించింది. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తటమే ప్రధాన అజెండాగా చట్టసభలకు వెళ్తున్నామని ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టంచేశారు.

మరోపక్క చంద్రబాబు అక్రమ అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదని.. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని తెలిపారు. ప్రజల్లో టీడీపీకి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అయితే... అసెంబ్లీలో మాత్రం చంద్రబాబు అరెస్టుపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాకే.. మిగిలిన ప్రజాసమస్యలపై చర్చించాలని కోరారు!

Full View
Tags:    

Similar News