అమెరికాలో భారీగా విదేశీయులు... షాకింగ్ ఫిగర్స్ చెప్పిన అధ్యయనం!
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదవడం, జాబ్స్ చేయడం, నివశించడమన్నా చాలామంది తీవ్ర ఆసక్తి చూపిస్తారనడంలో సందేహం లేదు.
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదవడం, జాబ్స్ చేయడం, నివశించడమన్నా చాలామంది తీవ్ర ఆసక్తి చూపిస్తారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో రోజు రోజుకీ అగ్రరాజ్యంలో నివశిస్తున్న విదేశీయుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో జో బైడెన్ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ ఈ సంఖ్య గణనీయంగా పెరిగిందని తాజా అధ్యయనం వెల్లడించింది.
అవును... చట్టబద్ధంగా అయినా, చట్టవిరుద్ధంగా అయినా మొత్తంగా అగ్రరాజ్యం అమెరికాలో నివాసముంటున్న విదేశీ జనాభా 2023 అక్టోబర్ నాటికి 49.5 మిలియన్లకు చేరిందని అంటున్నారు. ఇందులో భాగంగా 2021లో అధ్యక్షుడు జో బిడెన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రికార్డు స్థాయిలో 4.5 మిలియన్ల పెరుగుదల కనిపించిందని వాషింగ్టన్ కు చెందిన థింక్ ట్యాంక్ అధ్యయనం కనుగొంది.
ఇదే సమయంలో... యూఎస్ జనాభాలో వలసదారులు వాటా కూడా అమెరికన్ చరిత్రలో అత్యధికంగా 15 శాతం నమోదు చేయబడిందని.. ఇందులో భాగంగా సెన్సస్ బ్యూరో అక్టోబర్ 2023 సర్వేను ఉటంకిస్తూ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ తెలిపింది. ఈ క్రమంలో... కొనసాగుతున్న సరిహద్దు సంక్షోభంపై దేశంలో చర్చ జరుగుతున్న సమయంలో... 25 యూఎస్ రాష్ట్రాల వ్యక్తిగత జనాభా కంటే 4.5 మిలియన్ల పెరుగుదల పెద్దదని అధ్యయనం చెబుతుంది.
ఇదే క్రమంలో కోవిడ్-19 కి ముందు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నెలకు 42,000, బరాక్ ఒబామా రెండు పర్యాయాలు నెలకు 68,000 తో పోలిస్తే.. జో బైడెన్ అధికారం చేపట్టినప్పటి నుండి విదేశాల్లో జన్మించిన వారి జనాభా యూఎస్ లో నెలకు సగటున 1,37,000 పెరిగిందని నివేధికలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల జనాభాలో అత్యధికంగా చైనీయులు ఉన్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... చైనా 52 లక్షలు, భారత్ నుంచి 47 లక్షలు, ఫిలిప్పీ న్స్ 44లక్షలు, వియత్నాం నుంచి 22 లక్షల ప్రజలు అమెరికాలో ఉంటున్నారని అంటున్నారు!