రేవంత్ రెడ్డి రాంగ్ టైమ్ లో వెళ్లారా ?
ఇవన్నీ ఇలా ఉంటే అసలు రేవంత్ రెడ్డి ఈ తాజా అమెరికా టూర్ కరెక్టేనా అన్న చర్చ మొదలైంది. ఆయన సరైన టైమ్ లోనే ఈ టూర్ కి వెళ్లారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.
తెలంగాణా సీఎం గా గురుతర బాధ్యతలు స్వీకరించిన తరువాత రేవంత్ రెడ్డి తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన అక్కడ గత కొద్ది రోజులుగా పర్యటిస్తున్నారు. పెట్టుబడులను తెలంగాణాకు తీసుకుని రావాలని ఆయన పర్యటన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. భవిష్యత్తు తెలంగాణా అంటూ ఒక స్లోగన్ తో రేవంత్ రెడ్డి ఈ టూర్ చేస్తున్నారు.
అక్కడ పెట్టుబడిదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి టూర్ మీద విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పెట్టుబడులు ఏవీ రావడం లేదని కూడా కామెంట్స్ చేస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే అసలు రేవంత్ రెడ్డి ఈ తాజా అమెరికా టూర్ కరెక్టేనా అన్న చర్చ మొదలైంది. ఆయన సరైన టైమ్ లోనే ఈ టూర్ కి వెళ్లారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.
ఎందుకంటే ప్రపంచం అంతా ఇపుడు ఆర్థిక మాంద్యాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఎక్కడ చూసినా పారిశ్రామిక కళ తగ్గి వెలవెల బోతోంది. ఏ పెద్ద సంస్థ చూసినా కూడా ఉన్న బాధ్యతల నుంచి తప్పించుకోవాలని అన్నీ తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ కటింగ్ బడ్జెట్ మేనేజ్మెంట్ లో బిగ్ షాట్స్ పారిశ్రామిక దిగ్గజాలు తలమునకలు అయి ఉన్న వేళ రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం అమెరికా టూర్ పెట్టుకోవడం పట్ల చర్చ అయితే సాగుతోంది.
ఇక అమెరికా విషయానికి వస్తే అన్నింటిలోనూ అగ్ర తాంబూలం గా ఉన్న ఆ దేశం ఆర్థిక మాంద్యంలో ముందు ప్లేస్ లో ఉంది దాంతోనే సతమతం అవుతోంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో జాబ్ కటింగ్ అన్నది పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి ఉంది. ఉన్న దాన్ని ఎలా నిర్వహించాలి అని పారిశ్రామిక వేత్తలు బుర్రలు బద్ధలు కొట్టుకునే తరుణంగా ఉంది.
ఈ టైం లో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు అంటూ అమెరికాకు టూర్ కి వెళ్లడం చూస్తే వారికి ఉన్న బాధలకు ఈ వైపుగా చూసే తీరుబాటు కానీ ఓపిక కానీ ఉంటాయా అన్నదే చర్చగా ఉంది. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టండి అని అక్కడ కంపెనీలను రేవంత్ రెడ్డి ఎంత కోరినా ఎన్ని రకాలైన రాయితీలు ఇచ్చినా ఈ టైమ్ లో ఎవరు వస్తారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
మరి ఈ పరిస్థితి సీఎం బృందానికి కూడా అర్ధం అయింది అని అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి కూడా అందరినీ కలసి ఒప్పందాలను మాత్రమే కుదుర్చుకుంటూ ఎంఓయూల మీద సైన్ చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఎంఓయూలు అన్నీ కాగితాల మీదనే ఉంటాయి. అవి మెటీరియలైజ్ అయ్యేంతవరకూ ఎవరికీ నమ్మకాలు లేవు అని అంటున్నారు.
ప్రతీ ఒప్పందం అమలు కావాలని రూల్ ఏమీ లేదు. పైగా ఇపుడు ఉన్న ఆర్థిక మాంద్యం లో ఎవరూ కూడా గట్టిగా కమిట్ అయ్యే సూచనలు అయితే లేవు అనే అంటున్నారు. దాంతో ఈ ఎంఓయూల మీద కూడా డిస్కషన్ హాట్ హాట్ గానే సాగుతోంది.
ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అప్పటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ అమెరికా టూర్ చేశారు కొన్ని పెట్టుబడులు సాధించారు అంటే ఆనాటి వాతావరణమే వేరు అని అంటున్నారు. ఐటీ బూమ్ అపుడు ఉందని దాని వల్లనే పెట్టుబడులు కొన్ని అయినా తెలంగాణాకు వచ్చాయి అని గుర్తు చేస్తున్నారు. ఆనాటికీ నేటికీ ఎంతో తేడా ఉందని ఈ క్రమంలో ఎవరు పెట్టుబడులు పెడతారు అన్నదే పెద్ద ప్రశ్న అని అంటున్నారు.
ఒక కంపెనీ అయినా పరిశ్రమ అయినా పెట్టుబడులు పెట్టాలీ అంటే దానికి తగిన మార్కెట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మరో వైపు చూస్తే టెక్నికల్ గా అన్నీ అందుబాటులో ఉండడంతో ప్రపంచ గమనం మారిపోతోంది. టార్గెట్ కస్టమర్లు గతంలో ఉండేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేదు. దాంతో కంపెనీలు ఎంతో శ్రమకు ఓర్చి పెట్టినా ప్రొడక్షన్ చేసినా తగిన మార్కెట్ లేకపోతే అంతా వేస్ట్ అనే అంటున్నారు. దాంతో పాటు ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలకు గతంలో పారిశ్రామిక వేత్తలు మొగ్గు చూపేవారు. ఇపుడు అందరూ పిలుస్తున్నారు. ఈ స్ట్రాటజీ వారికి కూడా అర్ధం అయిపోయింది.
వీటిని చూసుకుని పెట్టుబడులు పెట్టి తమ పుట్టె ముంచుకునేందుకు ఇపుడున్న అస్థిరమైన ఆర్ధిక పారిశ్రామిక వాతావరణంలో ఎవరూ డేర్ గా స్టెప్ వేయడం లేదు అని అంటున్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి సీఎం గా తొలి అమెరికా టూర్ ఎలా ఉంది రిజల్ట్ ఏమిటి అన్నది విశ్లేషించుకునే ముందు ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. దాని కంటే ముందు రేవంత్ రెడ్డి రాంగ్ టైమ్ టూర్ ని ఎంచుకున్నారు అన్నది కూడా గుర్తుంచుకోవాలని అంటున్నారు.