తెలంగాణ పాలిటిక్స్.. ఏపీలో అలెర్ట్.. మ్యాటర్ ఇది..!
తెలంగాణలో గత రెండు రోజులుగా రాజకీయం హీటెక్కింది. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఒకరు దాడి చేసి.. గాయపరిచారు.
తెలంగాణలో గత రెండు రోజులుగా రాజకీయం హీటెక్కింది. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఒకరు దాడి చేసి.. గాయపరిచారు. ఈ కేసును ముందుగా స్థానికుల ఆగ్రహం మేరకు జరిగిందని భావించా రు. ఫార్మా సిటీని నిర్మిస్తున్న నేపథ్యంలో దీనికి భూములు ఇవ్వడం ఇష్టంలేని వారు.. కలెక్టర్‌పై దాడి చేశారని ప్రభుత్వం కూడా ముందు భావించింది. అయితే.. దాడి చేసిన నిందితుడిని పట్టుకున్నాక అనేక విషయాలు వెలుగు చూశాయి.
ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్ ఈ కేసు వెనుక ఉన్నారన్నది పోలీసులు చెబుతున్న మాట. ఇదే విషయాన్ని నిందితుడు సురేష్ రిమాండ్ రిపోర్టులోనూ పేర్కొన్నారు. నేరుగా మంత్రి పేరును ప్రస్తావించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై పూర్తిస్థాయి విచారణకు కూడా ఆదేశించింది. కట్ చేస్తే.. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసును నిశితంగా అధ్యయనం చేస్తోంది. సీనియర్ అధికారులను ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు పురమాయించారు.
తెలంగాణలో కలెక్టర్‌పై జరిగిన దాడి విషయాన్ని పరిశీలించాలని డీజీపీని కూడా ఆదేశించినట్టు తెలిసింది. అసలుకారణం ఏంటి? ఎందుకు? అనేది చూడాలని కోరినట్టు సమాచారం. దీనికి కారణం.. రాష్ట్రంలో నూ ఇప్పుడు ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి భూముల సేకరణ కు కూడా రెడీ అవుతోంది. మరో వైపు సోషల్ మీడియాలో దూకుడుగా ఉండి, ఇష్టానుసారం కామెంట్లు చేసిన వారిని అరెస్టు చేస్తున్నారు.
ఇదొక సంక్లిష్ట సమయం. ఈ నేపథ్యంలో ఏపీలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండే ఛాన్స్ ఉందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అలెర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ సహా.. డీజీపీని ఈ విషయంపై దృష్టి పెట్టాలని ముందుగానే కోరినట్టు తెలిసింది. రాష్ట్రంలో తెలంగాణ తరహా దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లపై కన్నేసి ఉంచాలని కూడా సీఎంవో నుంచి ప్రత్యేక ఆదేశాలు వెళ్లాయి.