బాబు మార్క్ :ఏపీలో పింఛన్ల పండగ.. రోజులో 95 శాతం పంపిణీ!
ఎన్నికల వేళ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్న వషయాన్ని చేతల్లో చేసి చూపించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎన్నికల వేళ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్న వషయాన్ని చేతల్లో చేసి చూపించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తాము అధికారంలోకి వస్తే అప్పటివరకు ఉన్న పింఛన్ ను రూ.4వేలకు చేయటమే కాదు.. ఏప్రిల్ మొదలు జూన్ వరకు నెలకు పెంచిన వెయ్యి తో కలిపి మొత్తం రూ.7వేల మొత్తాన్ని అవ్వతాతలకు అందిస్తానన్న చంద్రబాబు.. అన్నంత పని చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో మొత్తం లబ్థిదారుల్లో 95 శాతం మందికి పింఛన్ మొత్తాన్ని అందించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
ఏపీ వ్యాప్తంగా మొత్తం 65 లక్షల మంది పింఛన్ లబ్థిదారులు ఉన్నారు. తొలిరోజున 61.9 లక్షల మందికి పింఛన్ నుు పంపిణీ చేశారు. అంటే.. 95.1 శాతం మంది లబ్థిదారులకు పింఛన్ల or పూర్తి చేశారన్న మాట. పింఛన్ల పంపిణీ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పంపిణీలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా.. తమ రాజకీయ ప్రత్యర్థులు తప్పుగా చిత్రీకరించటంతొ పాటు.. ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే వీలున్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. పక్కా ఏర్పాట్లు చేశారు. గంట గంటకు ఫింఛన్ల పంపిణీకి సంబంధించిన వివరాల్ని తెలియజేసేలా ఏర్పాట్లు చేయటంతో పాటు.. ఏమైనా ఫిర్యాదు వచ్చినంతనే వాటిని పరిఫ్కరించారు.
కొన్నిచోట్ల సాంకేతిక కారణాల్ని బూచిగా చూపిస్తూ.. కొందరు పంపిణీ కార్యక్రమాన్ని ఆలస్యం చేసే ప్రయత్నం చేయగా.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి దాన్ని సరి చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దెబ్బకు దారికి వచ్చిన వారు.. పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. ఏపీ వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కనిష్ఠంగా 91 శాతం గరిష్ఠంగా 96.9 శాతం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీంతో.. సరాసరిన సోమవారం సాయంత్రానికి 95.1 శాతం మంది లబ్థిదారులకు పింఛన్లు అందాయి. రికార్డు స్థాయిలో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయటం ద్వారా చంద్రబాబు తన మార్క్ పాలన చేతల్లో చేసి చూపించారన్న మాట వినిపిస్తోంది.