‘సాక్షి’ని ఆపితే ప్రభుత్వానికి ఎన్ని కోట్లు సేవ్ తెలుసా?

మద్యం పాలసీ, ఇసుక పాలసీ, చంద్రబాబును జైలుకి పంపడం వంటి పలు నిర్ణయాలు వైసీపీని ముంచాయని చెప్పారు.

Update: 2024-06-25 04:59 GMT

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు చాలానే ఉన్నాయని.. వాటి ఫలితంగానే ఈ ఘోర ఫలితాలు చవి చూడాల్సి వస్తుందని వైసీపీ నేతలు ఒక్కొక్కరూ ఆఫ్ ద రికార్డ్ చెబుతున్న సంగతి తెలిసిందే. కాసు మహేష్ రెడ్డి మాత్రం ఓపెన్ గా పెర్ ఫెక్ట్ పోస్ట్ మార్టం చేశారనే కామెంట్లు వినిపించాయి.

మద్యం పాలసీ, ఇసుక పాలసీ, చంద్రబాబును జైలుకి పంపడం వంటి పలు నిర్ణయాలు వైసీపీని ముంచాయని చెప్పారు. ఇద్దరు ముగ్గురు వైసీపీ పెద్ద నేతలపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ పెద్ద నిర్ణయాలే కాకుండా.. చిన్న చిన్నవిగా కనిపిస్తూ ఖజానాకు పెద్ద డ్యామేజ్ చేసిన నిర్ణయాలూ చాలానే ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి వాలంటీర్లకు సాక్షి పత్రిక అందించడం.

అవును... గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు జగన్. నేడు వైసీపీ ఘోర ఓటమికి ఆ వ్యవస్థ కూడా కారణం అంటూ వినిపిస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే... సుమారు. 2.6 లక్షల మంది వాలంటీర్లకు ప్రతీరోజూ సాక్షి పేపర్ ను కొనుగోలు చేయడానికి రూ.200 అందించేవారు!

అయితే ఈ మొత్తం సాక్షి పత్రికకు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు కాకుండా.. సాక్షి సర్క్యులేషన్ విభాగంలోకి ఈ మొత్తం వెళ్లేది! అయితే అది ఒక్కో వాలంటీర్ వద్దా రూ.200 గా అనిపించినా.. కనిపించినా.. రాష్ట్రం మొత్తం మీద ఉన్న వాలంటీర్లందరికీ కలిసి ప్రతీ నెలా రూ.5.3 కోట్లు ఖర్చు అయ్యేది. ఇదంతా ప్రభుత్వ ఖజానా నుంచి సాక్షి ఖాతాలోకి వెళ్లేది.

అంటే... ఏడాదికి సుమారు 60 కోట్ల పైమాటే అన్నమాట. దీంతో... వాలంటీర్లకు సాక్షి పేపర్ వేయించుకోవడానికి ఇచ్చే సొమ్మును ఆపేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News