ఓటర్లందు తాగుబోతులు వేరయా ?
దాని వల్ల లిక్కర్ మాఫియా ఏపీలో రూపుదాల్చిందని అంతే కాదు లిక్కర్ దారుణమైన బ్రాండ్లను పెట్టి అధిక ధరలకు అమ్ముతూండడం వల్ల చాలా మంది ఆ లిక్కర్ తాగి మరణిస్తున్నారు అని కూడా ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చాయి.
ఓటర్లలో డివిజన్ ఎపుడూ ఉంది. 2019 ఎన్నికల వరకూ చూస్తే కనుక మహిళలు పురుషులు, చదువుకున్న వారు, చదువు లేని వారు, గ్రామీణం, పట్టణం, ఉద్యోగులు నిరుద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, కార్మికులు ట్రాన్స్ జెండర్స్ ఇలా అనేక సెక్షన్లు ఉంటూ వచ్చాయి.
వీరందరిని విభజించి వీరిలో ఎవరు తమకు ఓటు వేస్తారు. వేయకపోతే ఎలా వేయించుకోవాలి అన్న దాని మీద రాజకీయ పార్టీలు అన్నీ ఆలోచించి హామీలు ఇస్తూ ఉండేవి. కానీ 2019 ఎన్నికల తరువాత చూస్తే మరో కొత్త సెక్షన్ పుట్టుకుని వచ్చింది. ఆ సెక్షన్ పేరే తాగుబోతుల సెక్షన్.
వీరు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారు అన్నది విపక్షాలకు అర్ధం అయింది. అలా అర్ధం చేసుకుని వారి కోసం కూడా హామీలను కుమ్మరిస్తూ వస్తున్నారు. ఏపీలో మద్య పాన నిషేధం అమలు చేస్తామన్నది ఒకపుడు అందమైన నినాదం. ఇది 1955 ఎన్నికల నుంచి అలా హామీగా ఉంటూ వస్తోంది.
అయితే 1994లో సంపూర్ణ మద్య పాన నిషేధం అన్న నినాదాన్ని అందిపుచ్చుకుని దానిని ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన వారు ఎన్టీఆర్. ఆయన అంతలా డేరింగ్ అండ్ డేషింగ్ డెసిషన్ తీసుకున్నారు. అయితే ఎనిమిది నెలలకే ఆయన్ని కూలదోసి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్య పానాన్ని పూర్తిగా ఎత్తివేశారు.
ఆనాటి నుంచి నేటి దాక ఎవరూ మళ్లీ ఆ నినాదాన్ని అందుకునే సాహసం అయితే చేయలేదు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ మాత్రం దశలవారీగా సంపూర్ణ మద్య పాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అయితే జగన్ హయాంలో మద్య పాన నిషేధం దశలవారీగా అమలు కాలేదని మద్యం ధరలు దారుణంగా పెంచేశారని, అంతే కాదు చీప్ లిక్కర్ ని ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని టీడీపీ సహా విపక్షాలు విమర్శించడం మొదలెట్టాయి.
దాని వల్ల లిక్కర్ మాఫియా ఏపీలో రూపుదాల్చిందని అంతే కాదు లిక్కర్ దారుణమైన బ్రాండ్లను పెట్టి అధిక ధరలకు అమ్ముతూండడం వల్ల చాలా మంది ఆ లిక్కర్ తాగి మరణిస్తున్నారు అని కూడా ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చాయి. దాంతో చాలా కాలం నుంచే చంద్రబాబు తన సభలలో నాణ్యమైన మందుని తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరలకు అందిస్తామని చెబుతూ వస్తున్నారు.
ఎన్నికల సభలలో కూడా అదే విషయం ఆయన హోరెత్తించారు. దాంతో ఈసారి ఎన్నికల్లో కొత్త సెక్షన్ ఒకటి ఉందని దాని వల్ల ఓట్ల పంట పండుతుందని టీడీపీ సహా విపక్షాలే కనుగొని మరీ ముందుకు వచ్చినట్లు అయింది. ఇక ఇపుడు చూస్తే ఏపీలో అనేక రకాలైన సర్వేలు చూస్తే మగవారిలో టీడీపీకి అధిక ఓట్లు పడుతున్నాయి. అదే వైసీపీకి తక్కువ ఓట్లు వస్తున్నాయి. దానికి కారణం మద్యం ప్రియుల ఓట్లు అన్నీ కూడా టీడీపీ వైపు మళ్ళుతున్నాయని అంటున్నారు.
ఈ విధంగా చూస్తే ఈసారి ఎన్నికల్లో ఒక నాలుగు శాతం మద్యం ప్రియుల ఓటు షేర్ ఉంటుందని లెక్క కడుతున్నారు. వీరి ఓట్ల కోసం టీడీపీ బ్రహ్మాండమైన హామీలతో ముందుకు వస్తోంది. అయితే వీరి ఓట్లు పోయినా మహిళా ఓట్లు తమకు అధికంగా పడతాయి కాబట్టి అలా నష్ట నివారణ చేసుకోవచ్చు అని వైసీపీ ఆలొచిస్తోంది. మొత్తానికి చూస్తే ఓటర్లందు తాగుబోతులు వేరయా అన్నట్లుగానే ఏపీ పాలిటిక్స్ లో కొత్త వింతలను వారి ప్రభావాన్ని ఈసారి ఎన్నికల్లో అంతా చూడనున్నారు అని అంటున్నారు.