అర్జున్ మోడీ ని కలవడానికి ఒక కారణం ఉంది
యాక్షన్ కింగ్ అర్జున్ సొంత ఖర్చులతో తనకు ఆంజనేయునిపై ఉన్న భక్తితో గుడిని నిర్మించిన విషయం తెల్సిందే.
యాక్షన్ కింగ్ అర్జున్ సొంత ఖర్చులతో తనకు ఆంజనేయునిపై ఉన్న భక్తితో గుడిని నిర్మించిన విషయం తెల్సిందే. కొన్నాళ్ల క్రితం ఆ గుడి నిర్మాణం పూర్తి అయ్యి అత్యంత వైభవంగా ప్రారంభం కూడా అయ్యింది. ఎంతో మంది ప్రముఖులు ఇప్పటికే అర్జున్ కట్టించిన హనుమంతుని దేవాలయం ను సందర్శించారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటించారు. ఆ సందర్భంగా పలు ఆలయాలను మోడీ సందర్శించారు. ఆ సమయంలో అర్జున్ మరియు ఆయన కూతురు ఐశ్వర్య కలిసి మోడీని కలిశారు. అప్పుడే తన కూతురు ఐశ్వర్య తో కలిసి తాము నిర్మించిన హనుమంతుడి ఆలయంను సందర్శించాలని మోడీకి అర్జున్ విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేకమైన ఆంజనేయుడి చిత్ర పటాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అర్జున్ మరియు ఐశ్వర్య లు అందించారు. యాక్షన్ కింగ్ అర్జున్ విజ్ఞప్తి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించాడని తెలుస్తోంది. మరోసారి తమిళనాడు వచ్చిన సమయంలో తప్పకుండా హనుమంతుడి కొత్త ఆలయంను సందర్శిస్తాను అన్నారట.
ఒక వైపు ఆయోధ్య లో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీని అర్జున్ తమ ఆంజనేయుడి ఆలయాన్ని సందర్శించాలని కోరడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మధ్య కాలంలో అర్జున్ వరుసగా విలన్ రోల్స్ లో నటిస్తున్నాడు. లియో సినిమాలో అర్జున్ పోషించిన విలన్ రోల్ కి మంచి గుర్తింపు దక్కింది. తమిళ్ లోనే కాకుండా తెలుగు లో కూడా వరుసగా అర్జున్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.