అమెరికా ఎన్నికల్లో ఆ నాలుగు జాతులూ ఎవరు.... ఎటువైపు?

ఆసియా దేశాల వారూ ఇక్కడ తురుపుముక్కలనే కామెంట్లు వినిపిస్తుంటాయి. వారి పాత్ర అత్యంత కీలకం!

Update: 2024-10-25 03:56 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి ఆ దేశానికే పరిమితం కాదనే సంగతి తెలిసిందే. ఇక్కడ అనేక దేశాల నుంచి వలసవచ్చి స్థిరపడిన పెద్ద పెద్ద సమూహాలు ఉంటాయి. ఈ జాతులు అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఈ క్రమంలో... ఆసియా దేశాల వారూ ఇక్కడ తురుపుముక్కలనే కామెంట్లు వినిపిస్తుంటాయి. వారి పాత్ర అత్యంత కీలకం!

అవును.. వలస రాజ్యంగా పేరొందిన అగ్రారాజ్యంలో ప్రధానంగా నాలుగు జాతులు ఎన్నికలను ప్రభావితం చేస్తుంటాయి. వాస్తవానికి ఇక్కడ శ్వేత జాతీయులే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆఫ్రో అమెరికన్లు, స్పానిష్ మాట్లాడే హిస్పాన్నియన్లు, ఏషియన్లు కీలక భూమిక పోషిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీళ్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని అంటుంటారు!

వీరిలో ప్రధానంగా అధిక సంఖ్యలో ఉండేది మాత్రం శ్వేత జాతీయులే. అగ్రరాజ్యం జనాభాలో సుమారు 59 శాతం ఉండే వీరిలో అత్యధికులు రిపబ్లికన్స్ వైపే ఉంటుంటారు. అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంటుంది. "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" అంటూ ట్రంప్ స్టాండ్ తీసుకోవడంతో ఈసారి ఈ శ్వేత జాతీయుల ఓట్లు మరింతగా రిపబ్లికన్స్ కే పడతాయని భావిస్తున్నారు.

అమెరికాలో ఉన్న రెండో అత్యధిక జనాభా ఉన్న జాతి.. హిస్పానియన్లు. వీరు లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. వీరు ఎక్కువగా స్పానిష్ మాట్లాడతారు. అమెరికా జనాభాలో వైట్స్ తర్వాత అధిక సంఖ్యాకులు (19.1 శాతం) వీరే. దీంతో... వీరి ఓట్లు అత్యంత కీలకంగా ఉంటాయి. డెమోక్రట్ పార్టీ ఓట్లలో సుమారు 12 శాతం వీరివే ఉంటాయని చెబుతుంటారు.

ఇక వీరిద్దరి తర్వాత అధిక సంఖ్యలో ఉండేది ఆఫ్రో అమెరికన్లు. శతాబ్ధాల కిందట ఆఫ్రికా నుంచి బానిసలుగా వచ్చి ఇక్కడే స్థిరపడ్డ వారి వారసులైన వీరు ఇప్పటికీ జాతి వివక్షపై ఆందోళన చేస్తుంటారు. దేశ జనాభాలో వీరివాటా 12.6 శాతం కాగా.. వీరు డెమోక్రాట్లకు భారీగా మద్దతు ఇస్తారు. డెమోక్రాట్ ఓటర్లలో 17% వీరే ఉంటారు.

ఇక, ఈ జాబితాలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా ఆసియా దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ఆసియన్లు ఉంటారు. వీరు ఎక్కువగా డెమోక్రాట్లకు మద్దతు తెలుపుతుంటారు. 2022 ఎన్నికల్లో 68శాతం ఆసియన్లు డెమోక్రాట్లకు ఓటు చేసినట్లు చెబుతారు. అంచనాలకు అందదు అని చెప్పే వీరి ఆలోచన ఇప్పుడు ఎవరి వైపు ఉందనేది ఆసక్తిగా మారింది!

Tags:    

Similar News