భూమిని ఢీకొట్టిన గ్రహశకలం... వీడియో వైరల్!

ఓ గ్రహశకలం భూమిని ఢీకొంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు.. అది గ్రహశకలం సైజు, అది పడే ప్రాంతంపై ఆధారపడి ఉంటుందని అంటారు.

Update: 2024-12-04 04:55 GMT

ఓ గ్రహశకలం భూమిని ఢీకొంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు.. అది గ్రహశకలం సైజు, అది పడే ప్రాంతంపై ఆధారపడి ఉంటుందని అంటారు. వీటిపై నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రెగ్యులర్ గా ప్రపంచానికి సమాచారం ఇస్తుంటుంది. ఈ క్రమంలో... ఓ గ్రహ శకలం భూమిని ఢీకొట్టబోతోందని గుర్తించిన 12 గంటల్లోనే.. అన్నంత పని చేయడం గమనార్హం.

అవును... తాజాగా ఓ గ్రహశకలం భూమిని ఢీకొటీంది. సుమారు 70 సెంటీ మీటర్ల వ్యాసం కలిగిన ఓ గ్రహశకం గుర్తించబడిన కొన్ని గంటల్లోనే భూమిని ఢీకొట్టింది. ఇందులో భాగంగా... డిసెంబర్ 3 - 2024న రష్యాలోని యాకుటియాపై పడింది. ఈ సమయంలో అద్భుతమైన ఫైర్ బాల్ ను సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గతంలో భూమివైపు వచ్చిన కొన్ని గ్రహశకలాలను పోలి ఈ గ్రహశకలం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... 2022 డబ్ల్యూజే, 2023 సీఎక్స్ 1, 2024 బీఎక్స్ 1 లను పోలి ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం ప్రభావాన్ని అద్భుతమైన ఖచ్చితత్వంతో +/- 10 సెకన్ల లోపు విజయవంతంగా అంచనా వేశారు.

ఈ గ్రహశకలం భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అనేక శకలాలుగా విడిపోయి.. మారుమూల అటవీప్రాంతంలో చిన్న చిన్న రాళ్లను వెదజల్లింది. అయితే... అదృష్టవశాత్తు దీని పరిమాణం, అది పడిన ప్రాంతం కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. గణనీయమైన నష్టం ఏమీ సంభవించలేదని అంటున్నారు.

Tags:    

Similar News