ఓర్నీ.. రూ.100 కోసం ఏటీఎంనే పగలగొట్టేశాడు

ఫుల్ గా తాగేశాడు. రూ.వంద అవసరమైంది. దగ్గర్లోని ఏటీఎంకు వెళ్లాడు. ఎంత ప్రయత్నించినా.. తాను కోరుకున్న వంద రూపాయిలు రాలేదు

Update: 2024-07-06 05:30 GMT

ఫుల్ గా తాగేశాడు. రూ.వంద అవసరమైంది. దగ్గర్లోని ఏటీఎంకు వెళ్లాడు. ఎంత ప్రయత్నించినా.. తాను కోరుకున్న వంద రూపాయిలు రాలేదు. అంతే.. అక్కడే ఉన్న పెద్ద రాయిని తీసుకొని బంగారం లాంటి ఏటీఎంను ధ్వంసం చేసిన షాకింగ్ ఉదంతం రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది.

ఏటీఎంను ధ్వంసం చేసిన వైనాన్ని గుర్తించి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు రంగంలోకి దిగారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను ధ్వంసం చేసినట్లుగా భావించి కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఏటీఎం సెంటర్ కు దగ్గర్లోని సీసీ కెమెరాఫుటేజ్ ను పరిశీలించినప్పుడు రామాయంపేటకు చెందిన సాదక్ అనే వ్యక్తి.. ఏటీఏంను పెద్ద రాయితో ధ్వంసం చేసిన వైనాన్ని గుర్తించారు.

వెంటనే రంగంలోకి దిగి అతన్ని వెతికి పట్టుకున్నారు. ఈ సందర్భంగా అతన్ని విచారించగా.. తాను మత్తులో ఉండి రూ.వంద అవసరమై ఏటీఎంకు వెళితే.. అందులో నుంచి రూ.100 రాలేదని.. అందుకే రాయితో బద్ధలు కొట్టినట్లుగా పేర్కొన్నారు. వంద రూపాయిల కోసం ఏటీఎంను ధ్వంసం చేసిన వైనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. మందుబాబుల తీరు.. వారి ఆగడాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగిన మైకంలో ఇలాంటి పనులను చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News