చనిపోయాక ఫేమస్ అవుతున్న చిన్నారి... ఎవరీ అవ్ని ఎల్డూస్?

ఇలా గాజాపై జరుగుతున్న దాడుల్లో అర్ధాంతరంగా ఆయుష్షు తీరిపోయిన వారిలో 12 ఏళ్ల అవ్ని ఎల్డూస్ ఒకరు. ఈ చిన్నారికి బ్రతికున్నప్పుడు ఒక కోరిక ఉండేది.

Update: 2023-12-26 12:30 GMT

ఇజ్రాయేల్ - హమాస్ మధ్య మొదలైన యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే! హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయేల్ సైన్యం జరుపుతున్న దాడుల్లో వేలమంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొంతమంది నిరాశ్రయులవుతున్నారు.. లక్షల మంది అన్నపానియాలు లేక విలవిల్లాడుతున్నారు.

ఇలా గాజాపై జరుగుతున్న దాడుల్లో అర్ధాంతరంగా ఆయుష్షు తీరిపోయిన వారిలో 12 ఏళ్ల అవ్ని ఎల్డూస్ ఒకరు. ఈ చిన్నారికి బ్రతికున్నప్పుడు ఒక కోరిక ఉండేది. మాంచి యూట్యూబర్ కావాలని కలలు కన్నాడు. తన ఛానల్ కు కనీసం మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉండాలని.. అదే తన లక్ష్యం అని ఒక వీడియో చేశాడు. అయితే... అదే అతడి చివరి వీడియో అయ్యింది.

ఇలా యూట్యూబర్ కావాలన్న కలను నెరవేర్చుకోకుండానే ప్రాణాలు కోల్పోయాడు 12 ఏళ్ల అవ్ని. అయితే.. అవ్ని వీడియో చూసిన నెటిజన్లు అతడి కలను గుర్తించి, అతడు లేకపోయినా కలను నెరవేర్చేపనికి పూనుకున్నారు. దీంతో అవ్ని యూట్యూబ్ చానెల్‌ కు ఇప్పుడు 15 లక్షల మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు.

వాస్తవానికి అవ్నీ చానెల్‌ లో ఉన్నవి పది వీడియోలే అయినప్పటికీ... అతడి కలను నెరవేర్చాలని కంకణం కట్టుకున్న నెటిజన్లు... ఒక్కో వీడియోకు వేలకొద్దీ కామెంట్లు లైకులూ చేస్తూనే ఉన్నారు.

కాగా... ఆగస్టు 2022లో అవ్ని ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో భాగంగా... "హలో ఫోక్స్, నేను అవ్ని ఎల్డూస్. నేను గాజాలో ఉంటే పాలస్తీనియన్‌ ని. నా వయసు 12 సంవత్సరాలు. నా చానెల్‌ కు సబ్‌ స్క్రైబర్లు ఒక మిలియన్‌ కు చేరాలి. అదే నా లక్ష్యం" అంటూ చెప్పాడు.

అయితే... ఈ వీడియో చేసిన ఏడాది తర్వాత... యుద్ధంలో చనిపోయిన పాలస్తీనా తొలి చిన్నారుల్లో అవ్ని కూడా ఒకరు అని తేలింది! అవును... అక్టోబర్ 7న గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అవ్ని కుటుంబం మృతిచెందినట్లు అతడి బంధువులు చెప్పారు.

కాగా... అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ పై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయేల్ పై వేల ర్యాకెట్లు ప్రయోగించారు. ఆ దేశంలోకి ప్రవేశించి ప్రజలను ఊచకోత కోశారు. ఈ దాడులు జరిగిన కొద్ది గంటలకే తేరుకున్న ఇజ్రాయెల్ సైన్యం... హమాస్ లక్ష్యంగా గాజాపై ప్రతిదాడులు మొదలుపెట్టింది.

Full View
Tags:    

Similar News