అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ ముహుర్తం ఇదే!

యావత్ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమాచారం తాజాగా వచ్చేసింది

Update: 2024-01-16 05:16 GMT

యావత్ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమాచారం తాజాగా వచ్చేసింది. శతాబ్దాల పర్యంతం కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న అంశానికి సంబంధించిన కీలక ముహుర్తాన్ని డిసైడ్ చేశారు. అయోధ్యలో రామాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు వీలుగా ముహుర్తాన్నినిర్ణయించారు. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలయ్యే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యామ్నం 2 గంటలకు ముగియనుంది. ఈ విషయాన్ని శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

ప్రాణప్రతిష్ఠ చేసే బాలరాములోరి విగ్రహం బరువు 150-200 కేజీల మధ్యలో ఉండనుంది. జనవరి 18న ఆలయ గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచుతారు. ఈ రోజు (జనవరి 16) నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

చారిత్రక అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూడటం.. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రామాలయాన్ని నిర్మించేందుకు వీలు కలగటం తెలిసిందే. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కీలకమైన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగే 100 నిమిషాలు.. అత్యంత కీలకమని చెబుతున్నారు.

Tags:    

Similar News