అజారుద్దీన్ మదిలో అసెంబ్లీ... టెన్షన్ లో మాజీ ఎమ్మెల్యే?

అవును... టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వచ్చే ఎన్నికల్లొ పోటీకి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.

Update: 2023-08-11 01:30 GMT

కర్ణాటక ఎన్నికల అనంతరం కొత్త ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ సమయంలో చేరికలతో, సరికొత్త ఎత్తులతో సందడి చేస్తోంది. ఈ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఎంటరయ్యారు. అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పారని తెలుస్తోంది.

అవును... టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వచ్చే ఎన్నికల్లొ పోటీకి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో ఒక నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. దీంతో స్థానిక నేత అనుచరులు ఆందోళనలకు దుగుతున్నారు.

అజారుద్దీన్ 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతగా అసెంబ్లీకి ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా... జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తనకు తానుగా ప్రకటించుకున్నారని అంటున్నారు.

అనంతరం జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి వెళ్లిన అజారుద్దీన్ కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నియోజకవర్గానికి వెళ్లిన ఆయన... నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ప్రజలు కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనే వివాదానికి కారణమైంది.

దీంతో... జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి మద్దతుదారుల నుంచి నిరసన వ్యక్తం అయింది. జూబ్లీహిల్స్‌ తో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు. ఫలితంగా... విష్ణు మద్దతు దారులు అజాహరుద్దీన్ పర్యటనకు అభ్యంతరం చెప్పారు.

పైగా... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ పై జూబ్లిహిల్స్ నుంచి పోటీచేసి గెలవాలని విష్ణువర్దన్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ పెద్దలతో మంతనాలు జరిపారని అంటున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో గతకొంతకాలంగా ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు.

సరిగ్గా ఈ సమయంలో అజారుద్దీన్ ఎంటరయ్యారు. తాజాగా నియోజకవర్గ పరిధిలోని సోమాజీ గూడ, ఎర్రగడ్డ, బోరుబండ ప్రాంతాల్లో పర్యటించారు. పార్టీ కేడర్ తో కలిసి ఛాయ్ పే చర్చ నిర్వహించారు. స్థానికులతోనూ మమేకమయ్యే ప్రయత్నం చేసారు.

దీంతో విష్ణు వర్గీయులు అజార్దుద్దీన్ పై ఫైరవుతున్నారు. ఇదే సమయంలో అజాహరుద్దీన్ ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దింపాలని మరి కొందరు నేతలు సూచిస్తున్నారు. విష్ణు అనుచరులు మాత్రం ఈ కొత్త లొల్లి ఏందిరాబాయ్ అంటూ తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది.

మరి ఈ సమయంలో అధిష్టాణం పెద్దలు అజారుద్దీన్ ని ఒప్పిస్తారా.. లేక, విష్ణుని నొప్పిస్తారా.. అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News