బీసీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న బాబు

బీసీల రక్షణ కోసం బీసీ ప్రోటెషన్ చట్టాన్ని ఏపీలో తీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.

Update: 2024-09-17 15:13 GMT

ఎన్నికల వేళ బీసీలకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేసే దిశగా ఇపుడు చకచకా అడుగులు వేస్తున్నారు. బీసీల రక్షణ కోసం బీసీ ప్రోటెషన్ చట్టాన్ని ఏపీలో తీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీని వల్ల బీసీలకు రక్షణ చట్టపరంగా ఉంటుంది.

ఈ చట్టం కనుక వస్తే బీసీలు తమను ఎవరైనా ఏమైనా అంటే కనుక తమ మనోభావాలు దెబ్బతింటే ఈ చట్టం ప్రకారం ఎదుర్కోవడానికి పూర్తి హక్కులు ఉంటాయి. ఇది బీసీల ఆత్మగౌరవం నిలబెట్టేదిగా ఉంటుంది అని అంటున్నారు. బీసీలను ఈ విధంగా ఆకట్టుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.

అంతే కాదు బీసీలను పెద్ద ఎత్తున చట్ట సభలలోకి తీసుకుని వచ్చేలా వారి ప్రాతినిధ్యం ఉండేలా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తుంది అని అంటున్నారు. దాని కోసం కేంద్రానికి కూటమి ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది అని అంటున్నారు.

అదే విధంగా ఏపీలో బీసీ యువత కోసం ఐఏఎస్ స్టడీ సర్కిల్స్ ని ఏర్పాటు చేసేందుకు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరించి బీసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు చేపడుతోంది.

ఏపీలో బీసీ ఉప కులాల వివరాలను డేటాగా తీసి వారికి పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. బీసీ ఉప కులాల వివరాలకు సమగ్ర సర్వే చేయడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితికి సమగ్ర కార్యాచరణ, ప్రణాళికులు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

మరో వైపు బీసీల కోసం జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా రూ.100 కోట్లు రాబట్టడానికి అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ కూటమి ప్రభుత్వం ఇచ్చేందుకు కూడా తీర్మానించింది. బీసీల కోసం అనేక చర్యలను తీసుకోవడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం పెంపిందించడం కోసం ప్రభుత్వం చూస్తోంది. అంతే కాదు టీడీపీకి మొదటి నుంచి బ్యాక్ బోన్ గా ఉన్న బీసీలను పరిరక్షించుకోవడం గతంలో మాదిరిగానే వివిధ వృత్తుల వారికి అవసరమైన పధకాలను చేపట్టి చేయూతను అందించడం చేయాలని చూస్తోంది.

బీసీల విషయంలో ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకోవడం ద్వారా వారి మద్దతుని మరింతగా బలోపేతం చేసుకోవాలని టీడీపీ కూటమి ఆలోచిస్తోంది. వచ్చే నెలలో జరిగే శాసన సభ సభావేశాలలో బీసీలకు సంబంధించిన కీలక నిర్ణయాలను సభలో ప్రవేశపెట్టి ఆమోదిస్తారు అని అంటున్నారు. ఒక విధంగా ఇది బీసీలకు శుభ వార్తగానే చూడాలని అంటున్నారు. అదే విధంగా టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా మరో అడుగు అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News