బాబూమోహన్ తిరిగి పూర్వశ్రమానికి వెళ్తున్నారా?

అవును... సినీనటుడిగా ఓ వెలుగు వెలిగిన బాబూమోహన్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు.

Update: 2024-08-25 13:19 GMT

కొంతమంది రాజకీయ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ పార్టీలు మారుతూ సక్సెస్ అవుతుంటే... ఇంకొంతమంది మాత్రం పార్టీలు మారడం వల్ల గ్రాఫ్ డౌన్ ఫాల్ చేసుకుంటుంటారు. పరిస్థితుల ప్రభావమో.. కాల మహిమో.. ఎలా చెప్పుకున్నా జంపింగ్ లు కూడా అందరికీ కలిసిరావు! ఆ సంగతి అలా ఉంటే తాజాగా సినీ నటుడు, మాజీమంత్రి బాబూ మోహన్ కీలక స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అవును... సినీనటుడిగా ఓ వెలుగు వెలిగిన బాబూమోహన్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోనూ రాణించారు. ఎమ్మెల్యేగా మంత్రిగా సక్సెస్ ఫుల్ గానే బండి నడిపారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సైకిల్ దిగి కారు ఎక్కారు. ఆ తర్వాత రకరకాల పార్టీలు మారారు. ఈ నేపథ్యంలో తిరిగి పూర్వాశ్రమానికి తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును బాబూమోహన్ కలిశారు. ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఅర్ భవన్ లో చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు బాబూమోహన్. దీంతో... ఆయన తిరిగి టీడీపీలో చేరబోతున్నరనే ప్రచారం మొదలైంది. తెలంగాణ టీడీపీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారని అంటున్న వేళ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావొచ్చని చెబుతున్నారు.

కాగా... గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ బీజేపీలో ఉన్న బాబూమోహన్.. ఆందోల్ అ సెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా భారతీయ జనతాపార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలోనూ చేరారు! ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో... ఆయన ఇవాళ ఎన్టీఆర్ భవన్ లో దర్శనమివ్వడంతో పాటు, చంద్రబాబుతో భేటీ అవ్వడంతో ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయన పసుపు కండువా కప్పుకోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Tags:    

Similar News